ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక ఏ స్త్రీని బెదిరించలేరు.. మరో షాకింగ్ ట్వీట్ చేసిన మీరా చోప్రా!
ఎవరు ఊహించని వివాదంతో హాట్ టాపిక్ గా మారింది నార్త్ హీరోయిన్ మీరా చోప్రా. బంగారం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చాలా రోజుల తరువాత ఒక కాంట్రవర్సీ ద్వారా వార్తల్లో నిలవడం ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఒక రేంజ్ లో మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీస్ కేస్ కూడా వేసినట్లు చెప్పిన మీరా చోప్రా మరో షాకింగ్ ట్వీట్ చేసింది.
Recommended Video

ఎన్టీఆర్ ఎవరో తెలియదు..
బంగారం, వానా వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి కాస్త దగ్గరైన ఈ బ్యూటీ తెలుగులో చివరగా గ్రీకు వీరుడు సినిమాలో కనిపించింది. ఆ తరువాత తమిళ్ హిందీ ఇంగ్లీష్ అంటూ నార్త్ లోనే ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేసింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అని ఒక నెటీజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ కామెంట్ వైరల్ అయ్యింది.

కేసు నమోదు..
మీరా చోప్రాపై ఓ వర్గం నెటీజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం అలాగే కొన్ని అసభ్యకర హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేయడం వైరల్ అయ్యింది. ఆ కామెంట్స్ పై మీరా చోప్రా సైబర్ క్రైమ్ కి పిర్యాదు చేసినట్లు ట్వీట్ కూడా చేసింది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ మరో ట్వీట్ తో ఊహించని విధంవా షాకిచ్చింది.

మరో ట్వీట్..
ఇకపై ఎన్టీఆర్ ఏ అమ్మాయిని బెదిరించలేరు అనే విధంగా ట్వీట్ చేసింది. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ. అసభ్యకరంగా ట్వీట్స్ పై పిర్యాదు చేయడం జరిగిందని మీరా చోప్రా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అభిమానుల మధ్య ఫైట్..
చూస్తుంటే మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తెలుసు, ఎన్టీఆర్ ఎవరో తెలియదని అనగానే మీరా చోప్రాపై విమర్శలతో పాటు ఓ వర్గం నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఈ క్రమంలో అభిమానుల మధ్య కామెంట్స్ డోస్ కూడా పెరుగుతోంది. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











