మీరా జాస్మిన్ రీ ఎంట్రీ.. డైరెక్టర్‌తో హాటు హాట్‌గా సెల్పీ..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మీరా జాస్మిన్ ప్రతిభావంతురాలైన నటి. అయితే కెరీర్ మంచి జోష్‌లో ఉండగానే 2009లో పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోయారు. చాలా కాలం తర్వాత 2018లో పూమారం చిత్రంలో అతిథి పాత్రతో మలయాళ తెరపై మెరిసారు.
తాజాగా దర్వకుడు అరుణ్ గోపితో మీరా జాస్మిన్ దిగిన ఫొటో వైరల్‌గా మారింది. నా బెస్ట్ ఫ్రెండ్‌తో సమయాన్ని గడపడం కంటే జీవితంలో మరో మంచి విషయం ఉంటుందా అని అరుణ్ గోపి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

అయితే గతంలో బొద్దుగా ఉండే ఈ భామ.. మరింత నాజుకుగా.. సన్నగా మారి యువ హీరోయిన్లకు పోటీనిచ్చే విధంగా మారింది. తాను మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకొంటున్నాను అని తెలిపింది.
మీరా జాస్మిన్ కెరీర్ విషయానికి వస్తే.. హీరో దిలీప్‌తో కలిసి సూత్రధారన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పాడమ్ ఒన్ను: ఓరు విలాపం, ఓరే కాదల్ చిత్రాల్లో నటించింది. తెలుగులో పవన్ కల్యాణ్‌తో కలిసి గుడంబా శంకర్, రవితేజతో భద్ర, ఆ తర్వాత అమ్మాయి బాగుంది, రారాజు, మహారధి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











