మరోసారి రచ్చ చేసేందుకు రెడీ.. అదరగొట్టేసిన సిద్దు జొన్నలగడ్డ
లాక్డౌన్‌లో సిద్దు జొన్నలగడ్డ తన చిత్రాలతో చేసిన మ్యాజిక్ మామూలుగా లేదు. అందులో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలా ఈ సినిమాతో సిద్దుకి మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు సిద్దుకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రచయితగా, హీరోగా, నటుడిగా సిద్దు తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నాడు. తాజాగా అతను హీరోగా వస్తోన్న నరుడి బ్రతుకు నటన సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. నేడు చిత్ర కథానాయకుడు 'సిద్ధు జొన్నలగడ్డ' పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల తో కూడిన వీడియోను విడుదల చేసింది చిత్రం యూనిట్. అయితే ఇందులో సిద్దుకు తన శైలిలో సరిపోయే క్యారెక్టర్ వచ్చినట్టే కనిపిస్తోంది.

కీటో డైట్ రా... రైస్ తినం... ఆలుగడ్డ తినం... ఖాళీ ప్రోటీన్ తింటాం... ఫాట్ తింటాం..నో కార్బో హైడ్రేట్.., తిన్న ప్రొటీనంతా ఏడికి పోతుందిరా టిల్లు..... అంటూ సిద్దు తన బాడీని అద్దంలో చూసుకునే ఈ వీడియో క్రేజీగా ఉంది. మొత్తానికి మీట్ డీజే టిల్లు అనే వీడియో బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. ఈ మూవీలో ప్రిన్స్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ వంటి వారు కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











