Who Is Julius Francis? రామ్ చరణ్ బౌన్సర్‌గా బాక్సింగ్ ఛాంపియన్!.. మైక్ టైసన్‌కే ముచ్చెమటలు
సినీతారలు పబ్లిక్‌లోకి రావడం అత్యంత ప్రమాదకరం.. వారిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వారు జనంలోకి వెళ్తారు. ఎంత ప్రయత్నించినా అభిమానులను కట్టడి చేయడం అంత తేలిక కాదు. సినిమా వాళ్ల ఫంక్షన్లు, ఇతర ఈవెంట్స్‌లో ఆరడుగుల హైట్‌తో, కండలు తిరిగిన దేహంతో భారీకాయుల్లా, నల్లటి డ్రెస్‌లో భద్రతను చూసుకుంటారు బౌన్సర్లు. ఎవరి రేంజ్‌కు తగ్గట్లుగా వారు బౌన్సర్లను మెయింటైన్ చేస్తుంటారు. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్ పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి వైపు అందరి చూపు పడింది.
తండ్రికి తగ్గ తనయుడు చరణ్
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. తండ్రి బాటలోనే స్టార్ హీరోగా ఎదిగారు. నటన రాదన్న వారితోనే శెభాష్ అనిపించుకున్నారు. ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్ విషయంలో రాటుదేలి చిరంజీవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకులను పలకరించిన చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ విగ్రహం
కెరీర్‌లో ఎన్నో రికార్డులను, రివార్డులను అందుకున్న రామ్ చరణ్ కీర్తి కీరిటంలో మరో కలికితురాయి చేరింది. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మే 10న జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మైనపు విగ్రహంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. తద్వారా చరణ్ ఓ అరుదైన ఘనతను కూడా అందుకున్నారు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి మైనపు విగ్రహం చరణ్‌ది కావడం విశేషం. ఇప్పటికే పలువురు భారతీయ నటుల విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రపంచంలోని వేరే ప్రాంతాలు కావడం గమనార్హం.
చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
లండన్ పర్యటన సందర్భంగా రామ్‌చరణ్‌ను చూసేందుకు ప్రవాస భారతీయులు, తెలుగు వారు పెద్ద సంఖ్యలు గుమిగూడారు. ఈ సందర్భంగా అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చరణ్. ఈ క్రమంలో అభిమానులను కట్టడి చేసేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ బౌన్సర్ల బృందంలో బ్రిటీష్ హెవివెయిట్ ఛాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కనిపించడం చర్చనీయాంశమైంది.
మైక్‌టైసన్‌కు గట్టి పోటీ
60 ఏళ్ల ఫ్రాన్సిస్ బ్రిటన్ తరపున 1993-2006లలో బాక్సర్‌గా వ్యవహరించాడు. ప్రపంచ మేటి బాక్సర్ మైక్ టైసన్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు ఫ్రాన్సిస్. కెరీర్‌లో మొత్తం 23 విజయాలు సాధించి.. 24 పోటీలలో ఓడిపోయారు. 2012లో నటనా రంగంలో దిగిన ఫ్రాన్సిస్ పలు చిత్రాల్లో నటించారు. తాజాగా చరణ్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆయన తన బాక్సింగ్ బెల్ట్‌ను రామ్ చరణ్ చేతుల మీదుగా తన భుజంపై వేయించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











