పవన్ సినిమాల అసలు గుట్టు బయటపెట్టిన నాగబాబు.. క్రిష్ సినిమాలో పవర్ఫుల్ రోల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత వెండితెరపై దర్శనమివ్వబోతున్నాడు. ఆజ్ఞతవాసి సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమాన హీరోను రాజకీయాల్లో రోజు రియల్ హీరోగా చూసుకుంటూ మురిసిపోతున్న మెగా అభిమానులకు ఇప్పుడు పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ తరుణంలో నాగబాబు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.

తమ్ముడిపై స్పెషల్ ఫోకస్..

తమ్ముడిపై స్పెషల్ ఫోకస్..

జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకున్న తరువాత నాగబాబు సోషల్ మీడియాలో ఎక్కువగా బిజీ అయ్యారు. తమ్ముడి కోసం పాలిటిక్స్ లోకి దిగిన నాగబాబు అధికారపక్షం చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ కి ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ట్విట్టర్ లో అలాగే తన యూ ట్యూబ్ ఛానెల్ లో కాంట్రవర్సీలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలపై..

పవన్ కళ్యాణ్ సినిమాలపై..

ఇక చాలా కాలం తరువాత నాగబాబు పవన్ కళ్యాణ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవర్ స్టార్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదట బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక పిరియడిక్ హిస్టారికల్ డ్రామాతో రానున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు స్పెషల్ గా ఉంటాయని పవన్ కళ్యాణ్ తనతో చెప్పినట్లు నాగబాబు తెలిపారు.

వకీల్ సాబ్.. కొత్తగా ఉండబోతోంది..

వకీల్ సాబ్.. కొత్తగా ఉండబోతోంది..

హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాను తమిళ్ లో అజిత్ రీమేక్ చేశారు. దాదాపు ఆ రెండు సినిమాలు ఒకేలా ఉంటాయి. అయితే తెలుగులో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయని పవన్ తనదైన శైలిలో సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్లు చెప్పారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాను అమితంగా ఇష్టపడి చేసినట్లు తెలుపుతూ.. తనకు కరెక్ట్ గా సరిపోయే కథ ఇదేనని అన్నారట.

Recommended Video

Mega Brother Nagababu Comments on Pawan Kalyan's Upcoming Films
క్రిష్ సినిమాపై మరో క్లారిటీ..

క్రిష్ సినిమాపై మరో క్లారిటీ..

క్రిష్ డైరెక్షన్ లో పవన్ చేస్తోన్న 27వ సినిమా మొగలాయిల కాలం నాటి కథ అంటూ.. అది కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ అని నాగబాబు వివరణ ఇచ్చారు. ముందునుంచి ఈ ప్రాజెక్టుపై అనేక రకాల హిస్టారికల్ కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాగబాబు మరో క్లారిటీ ఇచ్చేశారు. కచ్చితంగా క్రిష్.. పవన్ క్రేజ్ కి తగ్గట్టుగానే పవర్ఫుల్ పాత్రలో చూపిసిస్తారని చెబుతూ.. పవన్ ఈ విధంగా రెండు డిఫరెంట్ సినిమాలతో వస్తుండడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X