RGV: ఆర్జీవీ చనిపోయి 20 ఏళ్లు... షాకింగ్ పోస్ట్ పెట్టిన నటుడు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే అనే విషయం తెలిసిందే. ఇక ఆయన తాజాగా వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు.. వర్మ తల నరికి తెస్తే కోటి అంటూ ప్రకటించడం.. దానికి ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై నాగబాబు మొదటి నుంచి సెటైర్స్ వేస్తూ రావడం.. మళ్లీ వర్మ కౌంటర్ వేయడం జరుగుతుంది. తాజాగా మళ్లీ నాగబాబు వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ చనిపోయి 20 ఏళ్లు దాటిందంటూ పోస్ట్ పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే....

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడనే చెప్పాలి. ఆయన తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలోనే అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా అంటూ ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ.. తనకు ప్రాణ హానీ ఉందంటూ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Mega Brother Nagababu Shocking Comments on Director Ram Gopal Varma Full Details Here

ఇక ఆర్జీవీ కంప్లైంట్ ఇవ్వడంపై జనసేన నేత నాగబాబు.. రామ్ గోపాల్ వర్మపై వ్యంగ్యంగా స్పందించాడు. వర్మ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా.. అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వర్మ మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోకా లేదు.. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నా... అంటూ రాసుకువచ్చాడు. ఇండియాలో ఏ పనికిమాలిన వెదవ మీకెటువంటి హాని తల పెట్టడు అంటూ సెటైర్స్ వేశాడు నాగబాబు.

ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా అంటూ ఆర్జీవీ పరువు తీశాడు నాగబాబు. మీరేం వర్రీ అవకండి కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి...ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు నాగ బాబు. అయితే ఈ పోస్టుకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే... నా సినిమాలో మీరు అంటూ వర్మ కౌంటర్ వేశాడు. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ రీ కౌంటర్ వేశాడు.

Mega Brother Nagababu Shocking Comments on Director Ram Gopal Varma Full Details Here

వర్మ వేసిన రీ కౌంటర్ కు మళ్లీ నాగబాబు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. వర్మ, మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రాసుకువచ్చాడు. కొంచెం షాక్ కి కూడా గురయ్యా.. ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు 20 ఏళ్లు దాటిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతోందని గ్రహించాలి అంటూ తన సోషల్ మీడియాలో రాసుకువచ్చాడు.

Mega Brother Nagababu Shocking Comments on Director Ram Gopal Varma Full Details Here

ఎనీ హౌ ఏదో ఓక రూపంలో నా పోస్టుకి సమాధానం ఇచ్చినందుకు సంతోషం... ఎప్పటికి మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ నాగబాబు వ్యంగ్యంగా రాసుకువచ్చాడు. మరి దీనికి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచి చూడాలి. ఇక ఇది చూసిన నెటిజన్స్.. వీళ్ల మధ్య మళ్లీ మొదలు అయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X