పెళ్లికి ముందు నిహారిక కష్టాలు.. కాబోయే భర్తకు ధీటుగా... అసలు కారణమిదే..

ఈ లాక్ డౌన్ లో అద్భుతాలు చాలానే జరిగాయి. టాలీవుడ్ లో అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సంఖ్య తగ్గడం ఒక పెద్ద షాక్. పెళ్ళంటే పారిపోయే హీరోలు కూడా వారికి నచ్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకొని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా త్వరలోనే తనకు నచ్చిన వాడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. అయితే కాబోయే భర్త కోసం నిహారిక ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి కోసం నిహారిక టార్గెట్

పెళ్లి కోసం నిహారిక టార్గెట్

పెళ్లి అంటేనే జీవితంలో ఓక్కసారే వచ్చే మంచి సెలబ్రేషన్. అలాంటి వేడుకలో అందరి చూపు ఎక్కువగా పెళ్లి కొడుకు పెళ్లి కుతురిపైనే ఉంటుంది. ఇక సెలబ్రెటీస్ వెడ్డింగ్ ఈవెంట్ అంటే అంతకు మించి అనేలా ఉంటుంది. అలాంటి వేడుకలో పెళ్లి కూతురుపై స్పెషల్ ఫోకస్ ఉంటుందని చెప్పాలి. అందుకే అందంగా కనిపించడానికి మెగా డాటర్ నిహారిక ఒక టార్గెట్ సెట్ చేసుకుంది.

 భర్తను ఆ విషయంలో డామినేట్ చేయాలని

భర్తను ఆ విషయంలో డామినేట్ చేయాలని

వరుడు చైతన్య జొన్నలగడ్డ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. చూడడానికి స్మార్ట్ గా ఉన్నాడు. మంచి ఫిజిక్ హైట్ తో స్టార్ హీరోలను తలపిస్తున్నాడు. ఇక అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ ని డామినేట్ చేయాలి అంటే పెళ్లి కూతురు అందం, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నిహారిక కూడా ఆ విధంగా అడుగులు వేస్తోంది.

ఉదయం 4.30గంటలకే నిద్రలేచి

ఉదయం 4.30గంటలకే నిద్రలేచి

గత కొన్నిరోజులుగా నిహారిక ఎక్కువగా జిమ్ లోనే కష్టపడుతోందట. ఉదయం 4.30గంటలకే నిద్రలేచి ఫిట్నెస్ సెంటర్ కి పరుగులు తీస్తోందట. డిసెంబర్ పెళ్లి చేయాలని నాగబాబు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్లి కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న నిహారిక ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.

నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా?

నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా?

లాక్ డౌన్ కారణంగా కాస్త బరువు పెరిగిన మెగా డాటర్ భర్తకు సరైన జోడిగా నిలిచేందుకు జిమ్ లో కష్టపడి కసరత్తులు చేస్తోంది. ఇటీవల ఆమె లావణ్య త్రిపాఠితో కలిసి దిగిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి తరువాత నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి నిహారిక ఈ విషయంలో ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

Recommended Video

Niharika, Nagababu Funny Conversation With Amaram Akhilm Prema Movie Team
కొత్త అల్లుడు హీరో అయ్యే ఛాన్స్..

కొత్త అల్లుడు హీరో అయ్యే ఛాన్స్..

అర్థం చేసుకున్నవాడు దొరకడంతో నిహారిక చాలా సంతోషిస్తోంది. ఇక మెగా ఫ్యామిలీలో చైతన్య కూడా జాయిన్ కానున్నాడు కాబట్టి.. హీరోగా ట్రై చేసే ఛాన్స్ లేకపోలేదు. మంచి హైట్, ఫిట్నెస్ తో పాటు ఒక ఫ్రేమ్ మాస్ లుక్కులో కూడా కనిపిస్తున్నాడు. చూస్తుంటే కళ్యాణ్ దేవ్ తరహాలో చైతన్య కూడా హీరోగా ట్రై చేస్తాడనే టాక్ వస్తోంది. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే వీరి పెళ్లి అయ్యేవరకు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X