Niharika Konidela: నీతో ఉంటే నాకు చాలా కంఫర్ట్​.. మెగా డాటర్ నిహారిక మళ్లీ షాకింగ్ కామెంట్స్​

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మధ్య కాలంలో మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల యూట్యూబర్ నిఖిల్ తో కలిసి పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోలో.. తన పెళ్లి, విడాకులు, లైఫ్ గురించి చెప్పుకువచ్చింది. ఇక రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ సంచలన కామెంట్స్ కూడా చేసింది. ఇక దీనిపై ఆమె మాజీ భర్త చైతన్య కూడా స్పందించి ఫైర్ అయ్యాడు. ఆ విషయం పక్కన పెడితే.. నిహారిక కొణిదెల ఇప్పుడు మరో పోస్టు పెట్టింది. తనతో ఉంటే కంఫర్ట్ అంటూ సంచలన పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే....

నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల... ఇంట్లో కుదిర్చిన పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంది. కానీ ఆ పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. పెళ్లైన మూడేళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు. ఇక విడాకుల తర్వాత నిహారిక కొణిదెల... తన బిజీలో తను ఉండగా.. చైతన్య కూడా తన లైఫ్ తాను గడుపుతూ బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే.. తొలిసారిగా విడాకులపై డైరెక్టుగా స్పందించిన నిహారిక.

 Mega Daughter Niharika Konidela Again Shocking Comments Her Post Goes Viral

తాజాగా యూటూబ్యర్ నిఖిల్ తో కలిసి ఓ పాడ్‌ కాస్ట్‌ చేసింది. అందులో తన పెళ్లి లైఫ్, విడాకుల గురించి చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తాను సినిమాలు చేయలేదని.. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తామని అంటున్నారని.. మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న అడిగారు.. మేం మా వృత్తిని ఎందుకు వదులుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని సూచించింది.

అది తెలియకుండా మనకు సెట్‌ అవని వ్యక్తిపై ఆధారపడకూడదని హితవు పలికింది పెళ్లి తర్వాత ఎన్నో సార్లు ఏడ్చాను అంటూ చెప్పుకువచ్చింది. ఇక నిహారిక కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే దీనిపై చైతన్య కూడా సీరియస్ అయ్యాడు. అలా ఇంటర్వ్యూలో వివాహం గురించి మాట్లాడొచ్చు.. విడాకుల గురించి మాట్లాడొచ్చు.. కానీ ఆ లైఫ్ గురించి వివరించొద్దు అంటూ మండిపడ్డాడు.

 Mega Daughter Niharika Konidela Again Shocking Comments Her Post Goes Viral

ఇక ఆ విషయం పక్కన పెడితే... నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి... అర్ధం చేసుకునేవాడు వస్తే చేసుకుంటా అంటూ కామెంట్స్ చేసింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది. అది హాట్ టాపిక్ గా మారింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన స్టోరీలో ఏముందంటే... ఐ లైక్ మి బెటర్ వెన్ ఐయామ్ విత్ యూ.. నన్ను నేను ఎక్కువగా ఇష్టపడతాను నీతో ఉన్నప్పుడు అంటూ రాసుకువచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. రెండో పెళ్లికి సిద్ధం అయిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పెళ్లి తర్వాత నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయింది. నిహారిక చివరగా సూర్యకాంతం అనే సినిమాలో నటించి మెప్పించింది. పలు వెబ్ సిరీసుల్లో నటించింది. ఇక చాలాకాలం తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, తెలుగులో ఓ సినిమా చేస్తోందట. ఇక వరుసగా సినిమాలతో బిజీగా మారనుంది మెగా డాటర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X