Niharika Konidela పవన్ కల్యాణ్ వల్లే కష్టాలు ఏంటో... నిహారిక కొణిదెల సంచలన వ్యాఖ్యలు!
మెగా డాటర్ నిహారిక ఓ ఇండిపెండెంట్ ఫిలిం సాగు చిత్ర స్రీనింగ్ లో పాల్గొంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన ఓటు హక్కు గురించి.. రాబోయే ఏపీ ఎన్నికల గురించి చెప్పుకువచ్చింది. పవన్ కల్యాణ్ వల్లే ఆ కష్టాలు తెలిశాయని చెప్పుకువచ్చింది. అసలు మెగా డాటర్ చేసిన కామెంట్స్ ఏంటనేది ఈ స్టోరీలో చూసేద్దాం.
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నాగబాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై యాంకరింగ్ తో తన ప్రయాణం మొదలు పెట్టినా... హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయి.. విడాకులతో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు, సిరీసుల చేసుకుంటూ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

నిహారిక కామెంట్స్ వైరల్
ఇదిలా ఉండగా నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేసింది నిహారిక. ఇక ఇండిపెండెంట్ ఫిలిం సాగు అనే చిత్రాన్ని చూసి.. దానికి సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది నిహారిక. తాజాగా సాగు సినిమా స్క్రీనింగ్ లో పాల్గొన్న నిహారిక.. అనంతరం మీడియాతో మాట్లాడింది. ఈ సినిమా ఓ ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిం. ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. రైతుల కష్టాల గురించి ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమాను వీక్షించిన నిహారిక అనంతరం మీడిాయతో పవన్ కల్యాణ్ గురించి, తన ఓటు గురించి మాట్లాడింది.
ఆంధ్రాలోనే ఓటు..
జనసేన పార్టీకి మీ తరఫు ఎంత వరకు ప్రమోషన్ చేస్తున్నారు అని ఓ విలేకరి ప్రశ్నకు నిహారిక కొణిదెల సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ... కచ్చితంగా చేస్తాను. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు నేను ఆంధ్రాకు వెళ్లాను. మీకు తెలుసో తెలియదో కానీ వెళ్లాను. ఈసారి కూడా కచ్చితంగా ఆంధ్రాకు వెళ్తాను. బాబాయి వెంటే మేము నడుస్తాము. నా ఓటు కూడా అక్కడే ఉందంటూ క్లారిటీ ఇచ్చింది నిహారిక.
బాబాయి వల్లే కష్టాలు ఏంటో...
ఇక ఈ 5ఏళ్లలో మీ బాబాయ పవన్ కల్యాణ్ రైతుల కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు.రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు. సో మీరు ఈ సినిమాకు సపోర్ట్ ఇవ్వడానికి ఓ రీజన్ అనుకోవచ్చా అని ఓ విలేఖరి నిహారికను అడగ్గా... నేను ఈ సాగు సినిమాకు ప్రోడ్యూస్ చేయలేదు. కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయి... దీనిని తీసుకున్నాను. నేను ఫిల్మ్ మేకర్. బాబాయితో పాటు ప్రచారానికి వెళ్లినప్పుడు రైతులతో స్వయంగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నాను. అలా ఈ సినిమా చూసినప్పుడు అది ఇది కనెక్ట్ అయిందనిపించిందని చెప్పుకువచ్చింది.

పలు సినిమాలతో బిజీగా...
ఇక నిహారిక కొణిదెల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. . పవన్ కళ్యాణ్ బాబాయ్ వల్లే రైతుల కష్టాలు తెలిసాయని నిహారిక చెప్పడం.. పవన్ ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిహారిక విషయానికి వస్తే.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహారిస్తునే తమిళంలో ఇటీవల ఓ సినిమాకు సైన్ చేసింది. మద్రాస్ కారన్ అనే సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు.. ఆహాలో చెఫ్ మంత్రాకు యాంకరింగ్ చేయబోతుంది.


Click it and Unblock the Notifications











