ప్రేమలో పడ్డ నిహారిక.. లెటర్‌తో సహా బయటపెట్టి షాకిచ్చిన మెగా డాటర్
దాదాపు డజను మంది హీరోలున్న మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక కొణిదెల. రెండు మూడు సినిమాలు చేసిన ఆమె కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ కాకుండా నిర్మాణ రంగం వైపు వేసి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలిచారు. మంచి కంటెంట్‌తో , తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ తనను విమర్శించిన వారి చేత ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
తొలుత తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌లో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక కొణిదెల తర్వాత ఒక మనసులో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాల్లో నటించింది. తర్వాత పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో మెరిసింది. కానీ అవేవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ దశలో
సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.

కానీ పెళ్లయిన రెండేళ్లకే అభిప్రాయ భేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమను, మెగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నాళ్లు మౌనంగా ఉన్న నిహారిక .. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందిని తట్టుకుని నిలబడి తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. అయితే నటిగా అంత సక్సెస్ కాలేకపోవడంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారింది.
ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినిమాలపై ఫోకస్ పెట్టిన నిహారిక.. గతేడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 25 కోట్లు రాబట్టి తొలి ప్రయత్నంలోనే నిహారిక నిర్మాతగా సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను ఆమె నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాతగా ఉంటూనే హీరోయిన్‌గా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా మలయాళ మూవీ మద్రాస్ కారన్‌లో నిహారిక హీరోయిన్‌గా నటించింది. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇవి కాకుండా తన నిర్మాణ సంస్థ నుంచి పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు తెరెక్కించే పనిలో నిహారిక బిజీగా ఉన్నారు.
సిద్ధూతో విడాకుల తర్వాత నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, ఫలానా వారితో ప్రేమలో పడిందంటూ రకరకాల కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి నిహారిక గురించి రాసిన నోట్‌ని షేర్ చేస్తూ.. మైనర్ పాస్‌పోస్ట్ నోట్‌బుక్, నేనే వాడిని ప్రేమిస్తున్నానని అంబటి భార్గవి నువ్వు మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి రావొద్దు అంటూ రాసుకొచ్చింది. అలాగే ఈ పోస్ట్‌కి రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా జోడించింది. కానీ ఆ పిల్లాడు ఎవరు? ఎందుకు నిహారిక కోసం అలా రాశాడు? అనేది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి ఈ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











