Niharika Konidela గుడ్ న్యూస్ చెప్పిన నిహారిక కొణిదెల... ఆరోజు నుంచే కొత్త జర్నీ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాలు, సిరీసులు చేసింది. ఇక పెళ్లి, విడాకుల తర్వాత తన జీవితం తాను గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న నిహారిక తాజాగా నెటిజన్లతో ముచ్చటించింది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే నిహారిక ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 17 నుంచి తన కొత్త ప్రయాణం ప్రారంభం అవుతున్నట్లు వెల్లడించింది. అసలు నిహారిక చెప్పిన విషయం ఏంటో కులంకషంగా తెలుసుకుందాం పదండి.
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల మొదట ఈటీవీలో ఢీ డ్యాన్స్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తండ్రితో సిరీసుల్లో నటించింది. ఇక ఒక మనసు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో కలిసి ముద్దుల సీన్లలో రెచ్చిపోయింది. ఆ తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఆమెకు సినిమాలు అంతగా కలిసి రాలేదు.

ఇక చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకుని కొన్నాళ్లు హ్యాపీగానే వీరు జీవితాన్ని గడిపారు. ఏమైందో తెలియదు కానీ వీరు గత ఏడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు అంతా షాక్ అయ్యారు. ఇక విడాకుల తర్వాత కూడా నిహారిక తన ఫ్రీడమ్ లైఫ్ గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. నిజానికి చెప్పాలంటే విడాకుల అనంతరం గ్లామర్ డోస్ పెంచేసింది. అంతే కాదు వరుసగా సినిమాలు, సిరీసులతో బిజీగా మారిపోయింది.

రోజుకో ఫోటోషూట్ వదులుతూ.. అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. తనపై ఎటువంటి ట్రోలింగ్స్ వచ్చినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అందులో భాగంగా క్వశ్చన్స్ అడగండి ఆన్సర్స్ తెలుసుకోమని తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ప్రశ్నలు వేశారు. దానికి నిహారిక ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది.

మీ లైఫ్ ఎలా సాగుతుంది? అనే ప్రశ్నకు నిహారిక ఫెన్ టాస్టిక్ అని సమాధానం ఇచ్చింది. మీ చర్మ సౌందర్యానికి ఏం వాడుతారు అని అడగ్గా.. నిహారిక పలు బ్రాండ్స్ ఫోటోలు పోస్ట్ చేసింది. మీరు కాఫీ లవరా అని అడగ్గా బిగ్ టైమ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. వాట్ ఇజ్ యువర్ ఫెవరేట్ హాలిడే స్పాట్ అనగా.. మామబలి అంటూ ఊయలపై ఊగుతున్న విజువల్ పోస్ట్ చేసింది. మీ ఫేవరేట్ యాక్ససిరి ఏంటి అడగ్గా ముక్కు పుడక అని చెప్పుకువచ్చింది.

ఇక ఓ నెటిజన్ మీ తమిళ్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని అడగ్గా... మార్చి 17న షూటింగ్ ప్రారంభం అవుతందని గుడ్ న్యూస్ చెప్పింది నిహారిక. అంటే ఆ రోజు నుంచే తన తమిళ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. దీంతో కొత్త జర్నీ స్టార్ చేస్తున్నందుకు నిహారికకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు పలువురు ఫ్యాన్స్. ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు.. ఈ సినిమాతో నిహారిక కెరియర్ మలుపు తిరగాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











