తొలిసినిమాకే తల పట్టుకుంటున్న నిహారిక.. ఆమె ప్రొడక్షన్‌లో వచ్చే మొదటి చిత్రం ఏంటంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమై అందాలు కల్గిన ఈమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే అనేక వెబ్ సిరీస్ లలోనూ కనిపించి సందడి చేసింది. అయితే ఇటీవలే ఈమె ఓ ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేయగా.. ఓ సరికొత్త సినిమా నిర్మించేందుకు సిద్ధం అయింది. అయితే ఆ సినిమా టైటిల్ పేరు ఏంటో రివీల్ చేసేందుకు ఓ సరికొత్త వీడియోతో వచ్చింది. అందులో ఏముంది.. మరి నిహారిక నిర్మించబోయే తొలి సినిమా టైటిల్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నప్పుడే యాంకర్ గా మారి ఢీ షోను హోస్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఒక మనసుతో పాటు పలు సినిమాలు చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తెలుగు సినీ ప్రియుల మనసులను తాకే చిత్రాలు చేసినా.. బాక్సాఫీసు వద్ద మాత్రం భారీ వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తన ప్రొడక్షన్ లోనే పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ.. వాటిలో నటించి మెప్పించింది. ఈమె స్థాపించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ లో తొలిసారి సినిమా నిర్మించాలని ఫిక్స్ అయింది.

తన ప్రొడక్షన్ లో రాబోతున్న తొలి సినిమా టైటిల్ ను రివీల్ చేసేందుకు ఓ వీడియో చేసింది. అందులో తాను ఈ టైటిల్ ను ఎప్పుడు, ఎవరి సమక్షంలో రివీల్ చేయబోతుందో కూడా వెల్లడించింది. ముఖ్యంగా తాను చేయబోయే సినిమాలోమొత్తం 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు ఉండగా.. వారందరినీ ఈ వీడియోలో చూపించింది. వారందరూ చేసే పనులు చూసి తల పట్టుకున్న నిహారిక.. డైరెక్టర్ తో వీళ్లే మన సినిమాలో హీరోహీరోయిన్లు అని చెప్పొద్దు సార్ అంటూ బతిమాలింది.
ముందుగా కారు దిగి తన ఆఫీసులో అడుగు పెట్టిన నిహారికకు.. తన సినిమాలోని హీరోహీరోయిన్లు.. చిన్న పిల్లల చేష్టలు వేస్తూ కనిపించారు. ఎవరికి వారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ కనిపించగా.. పైకి వెళ్తుంది. అక్కడ డైరెక్టర్ ను చూసి బయట ఉన్న వాళ్లంతా ఏ పిచ్చి ఆస్పత్రిలోంచి వచ్చారు, వారిని ఎవరికి లోపలికి రానిచ్చారంటూ అడుగుతుంది. దీంతో అతడు వారిని పిలవగా.. చూసి షాక్ అవుతుంది నిహారిక. వీళ్లే మన సినిమాలో నటీనటులు అని చెప్పొద్దు సార్ అంటూనే తల పట్టుకుంది. గుండెల్లో నొప్పి, ఆయాసం వస్తుందంటూ టెన్షన్ పడుతుంది.
కానీ ఆ తర్వాత డైరెక్టర్.. మెల్లిగా శ్వాస తీసుకుని, మన కథ గుర్తుకు చేసుకుని చూడండి.. వీళ్లే మన సినిమాకు కరెక్ట్ అనిపిస్తారనగానే.. నిహా కళ్లు మూసుకుని తెరుస్తుంది. అప్పుడు వాళ్లను చూసి సినిమాలోనే క్యారెక్టర్లకు సూటయ్యే పేర్లు చెబుతుంది. ఇలా ఈ వీడియో ముగియగా.. చివర్లో ఈ సినిమా టైటిల్ ను ఏరోజు రివీల్ చేయబోతున్నారో ప్రకటించారు. ముఖ్యంగా సాయి దుర్గ తేజ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్లు వివరించారు. ఉగాది పండుగ సందర్భంగా.. ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన తొలి సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications











