Niharika Konidela: ఇటలీలో అతడితో కలిసి నిహారిక లంచ్ డేట్... కాబోయే భర్త అంటూ...

మెగా డాటర్ నిహారిక కొణిదెల.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తన అన్న పెళ్లి కోసం ఇటలీ వెళ్లింది. ఇక అక్కడ వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఈ నవంబర్ 1వ తేదీన జరగనుంది. అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా.. అక్కడ నిహారిక సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో ఆమె లంచ్ డేట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు....

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసిన ఈ భామ... ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించిన ఈ భామ.. నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో నాగశౌర్యతో హద్దుమీరి నటించిందని కామెంట్స్ వచ్చాయి. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

Mega Daughter Niharika Konidela Lunch Date with Panja Vaishnav Tej in Italy and Netizens Comments Are Viral

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నిహారిక.. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. కొన్నాళ్లు ఈ జంట బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవల విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. దీనితో మెగా ఫ్యాన్స్ తో పాటు... అందరూ షాక్ అయ్యారు. ఇక ఇరువురు ఎవరి లైఫ్ వారు గడుపుతున్నారు. నిహారిక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. రోజుకో ఫోటో షూట్ పెడుతూ.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.

Mega Daughter Niharika Konidela Lunch Date with Panja Vaishnav Tej in Italy and Netizens Comments Are Viral

ఇక ప్రస్తుతం నిహారకి అన్న పెళ్లిలో సందడి చేసేందుకు ఇటలీ వెళ్లింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమించుకోగా.. ఇక వీరు ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలో వీరి పెళ్లి జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాలతో పాటు.. అల్లు ఫ్యామిలీ కూడా ఈ పెళ్లిలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడి వెళ్లింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, పంజా వైష్ణవ్, తేజు అక్కడ సందడి చేస్తున్నారు. వీడియోలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Mega Daughter Niharika Konidela Lunch Date with Panja Vaishnav Tej in Italy and Netizens Comments Are Viral

అయితే ఇటలీలో ఓ వ్యక్తితో లంచ్ డేట్ చేస్తున్నట్లు నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఆయన ఎవరో కాదు.. పంజా వైష్ణవ్ తేజ్. అతనితో కలిసి ఇటలీలో నిహారిక లంచ్ డేట్ కు వెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇది చూసిన నెటిజన్స్... రెండో భర్త ఇతనేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Mega Daughter Niharika Konidela Lunch Date with Panja Vaishnav Tej in Italy and Netizens Comments Are Viral

ఇక వైష్ణవ్ తేజ్ వరుసకు బావ కావడంతో... పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నిహారిక, పంజా వైష్ణవ తేజ్ లంచ్ డేట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక, సాయి ధరమ్ తేజ్ పై కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. వాటిని నిహారిక తిప్పి కొట్టింది. ఇప్పుడు మళ్లీ నిహారిక స్పందిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X