Niharika Konidela: అసలు సిసింద్రీ నేనే కానీ.. అఖిల్ చేసేశాడు.. సీక్రెట్ బయటపెట్టిన నిహారిక!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. దానికి కారణం.. ఓ యూట్యూబర్ తో ఓ పాడ్ కాస్ట్ నిర్వహించి.. తనకు సంబంధించిన విషయాలతో పాటుగా పెళ్లి, విడాకులపై మాట్లాడటం. ఇక ఈ విషయం ఆమె మాజీ భర్త కూడా స్పందించాడు. ఆ విషయం పక్కన పెడితే.. నిహారిక కొణిదెల.. అఖిల్ నటించిన సిసింద్రీ సినిమాలో నటించాల్సి ఉండేనట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను మిస్ చేసుకున్నట్లు చెప్పుకువచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

నాగా బాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల... మొదట యాంకరింగ్ తో కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత జోన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకుని... విడాకులు కూడా తీసుకున్నారు.

Mega Daughter Niharika Konidela missed the role of Akhil Akkineni in Sisindri movie Full Details Here

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక సిసింద్రీ సినిమా మొదట తనకే ఆఫర్ వచ్చిందని చెప్పుకువచ్చింది. ముఖ్యంగా ఆమె పుట్టిన తర్వాత సిసింద్రీ సినిమా ఆఫర్ వచ్చిందని... కానీ ఆ సినిమాను చేయలేక పోయాను అంటూ చెప్పుకువచ్చింది. నిహారిక కొణిదెల... 1993 డిసెంబర్ 18న నాగబాబు, పద్మజ దంపతులకు రెండవ సంతానంగా పుట్టింది. నిహారిక పుట్టే సమయంలో నాగాబాబు ముగ్గురు మొనగాళ్లు సినిమాకు నిర్మాతగా ఉన్నారు.

ఇక ఆ చిత్రంలో హీరోగా చిరంజీవి నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ముడు పాత్రల్లో నటించారు. ఇక ఆ సినిమాలోని పోలీస్ క్యారెక్టర్ లోనే నిహారికను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు చిరంజీవి. అలా అప్పుడు నాగ బాబు కూతురిని చిరంజీవి పోలీస్ గెటప్ లోనే మొదటి సారి చూశాడని చెప్పుకువచ్చింది. నాగబాబుకు వరుణ్ తేజ్ పుట్టాకా.. కూతురు పుట్టాలని అనుకున్నారట. అలా అనుకున్నట్లుగానే నిహారిక పుట్టింది.

కానీ ఆ టైంలో తన తండ్రి తనతో లేదని చామంతి పువ్వా పువ్వా అనే పాట షూటింగ్ లో సెట్ లో బిజీగా ఉన్నారని చెప్పుకువచ్చింది నిహారిక. నిహారిక పుట్టాక చాలా యాక్టివ్ గా ఉండేదని చెప్పుకువచ్చింది. పుట్టిన తర్వాత ఎనిమిది నెలలకే ఆమె నడవడం కూడా చేసిందని తెలిపింది. అదే టైంలో సిసింద్రీ సినిమా కోసం చిన్నబాబు పాత్ర కోసం పాపను వెతికే పనిలో ఉన్నారట సిసింద్రీ మేకర్స్. కానీ పాకుతున్న బాబు కావాలని... అనుకున్నారట.

నిహారిక అప్పటికే నడవడం కూడా మొదలు పెట్టేసరికి ఆమెను కాదని మరో ప్రయత్నం చేశారట మేకర్స్. నాగార్జునకు సైతం ఆ సమయంలో బాబు పుట్టడంతో అప్పుడే పాకుతున్న అఖిల్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేశారని చెప్పుకువచ్చింది. అలా సిసింద్రి సనిమాను నిహారిక మిస్ చేసుకుంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X