ఒక్క ఫొటోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక.. లవ్ మ్యారేజ్.. వరుడు ఎవరంటే?
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా కూడా ఒక మంచి నటిగా అయితే ఆడియెన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ని అందుకుంది. సోషల్ మీడియాలో కూడా రోజేరోజుకి తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. ఇకపోతే చాలా రోజుల తరువాత మెగా డాటర్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మెగా డాటర్ ఒక్క ఫొటోతో మరో క్లారిటీ ఇచ్చేసింది.

సక్సెస్ కాకపోయినా..
మెగా డాటర్ నిహారిక కెరీర్ హీరోయిన్ గా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి చూపలేదని అర్ధమవుతోంది. కేవలం తనకు నచ్చినట్లు యాంకర్ గా, సహా నటిగా పాత్రలు చేస్తూ క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అయితే అందుకుంది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ లేదు.

పెళ్లికి సిద్దమైన మెగా డాటర్..
నాన్న కూచి అంటూ మొదట్లో ఒక వెబ్ సిరీస్ చేసిన నిహారిక ఆ తరువాత గ్లామర్ గర్ల్ గా కనిపించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇకపోతే అమ్మడు ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా డాటర్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ గట్టిగా వినిపిస్తున్న సమయంలోనే ఆమె ఒక స్పెషల్ ఫోటో వదిలి.. కన్ఫ్యూజన్ లేకుండా చేసింది.

ఆ ఒక్క ఫొటోతో..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు కూడా తన కూతురి వివాహంపై ఒక క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా నెక్స్ట్ సమ్మర్ లో నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పడంతో వరుడు కూడా ఫిక్స్ అయ్యి ఉంటాడని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో నిహారిక ఒక స్టార్ బక్స్ కాఫీ కప్ మీద Ms కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. అలాగే ఎవరై ఉంటారనే ప్రశ్నను కూడా లేవనెత్తింది.
Recommended Video

పెళ్లి కొడుకు ఎవరు.. లవ్ మ్యారేజ్?
పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు నిహారిక ఫైనల్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే పెళ్లి కొడుకు ఎవరనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక గత కొన్నాళ్లుగా నాగబాబు ఫ్యామిలీ ఒక కుర్రాడిని నిహారిక కోసం అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో మెగా డాటర్ కి కూడా అతను బాగా నచ్చడంతో ఆల్ మోస్ట్ ఒక లవ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇద్దరు అమితంగా ఇష్టపడుతున్నారని వచ్చే సమ్మర్ లోనే నిహారిక పెళ్లి చేయాలని నాగబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











