Niharika Konidela: మెగా డాటర్ సీక్రెట్ టాటూ ఫొటో లీక్.. తీసింది ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరోనే!
మెగా డాటర్ నిహారికి కొణిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ.. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ రచ్చ చేస్తోంది. కేవలం నటన మాత్రమే కాకుండా ప్రొడక్షన్ వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సీక్రెట్ టాటూ ఫొటోలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఫొటోలను తీసింది ఓ తెలుగు యంగ్ హీరో కావడం గమనార్హం. అతను ఎవరు, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నాగబాబుకు పుట్టిన ఈ ముద్దుగుమ్మను.. చింరంజీవి, పవన్ కల్యాణ్ లు కూడా సొంత కూతురుగానే చూస్తూ.. విపరీతమైన ప్రేమ కురిపిస్తుంటారు. మెగా ఫ్యామిలీలో తెగ అల్లరి చేచే ఈమె చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. ముఖ్యంగా యాంకర్ గా కెరియర్ ప్రారంభించి అందరినీ తెగ అలరించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ రచ్చ చేసింది. ముఖ్యంగా ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.

ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గానూ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. భర్తతో విడాకుల తర్వాత నుంచి పూర్తిగా కెరియర్ పైనే దృష్టి సారించిన ఈమె ఓ సినిమాకు సంతకం చేసింది. అలాగే తన ప్రొడక్షన్ లో తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా తన కెరియర్ పనుల్లో చాలా బిజీగా ఉన్న ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిహారిక కొణిదెల షాకింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అద్భుతమైన అందాలు ఆరబోసింది. అలాగే తన కాలికి ఉన్న ఓ సీక్రెట్ టాటూను కూడా చూపించింది. అందులో కుడి కాలిపై వర్షం పడుతున్నట్లుగా ఉండే టాటూను చూపించింది. మేఘం పైనుంచి వర్షం పడుతున్నట్లుగా ఉండే ఈ టాటూకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు తీసింది మరెవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి అని చెప్పుకొచ్చింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు.
ఈ ఫొటోలు తీసింది ప్రియదర్శియా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరేమో.. ఈ ఫొటోలు చాలా బాగున్నాయని, అందంగా కనిపిస్తున్నావు నిహా అంటూ చెప్పుకొస్తున్నారు. ఏమైనా ప్రియదర్శి చాలా బాగా ఫొటోలు తీస్తున్నారని కొందరు.. తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా నిహారిక కాలిపై ఉన్న క్రేజీ టాటూను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











