సండే వస్తే బెడ్ మీద ఇలా చేయాల్సిందే... మెగాడాటర్ నిహారిక షాకింగ్ పోస్ట్!
నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా రాణించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ మెగా డాటర్ నిహారిక. ఈ మధ్య కాలంలో మరింత దూకుడు చూపించేందుకు ఉత్సాహం చూపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అందాలను ప్రదర్శిస్తోంది. తద్వారా ఫ్యాన్స్‌కు మరింత చేరువలో ఉంటోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి వైరల్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. దాని గురించే ఈ కథనం..
ఏదీ వర్కౌట్ కాలే :టీనేజ్‌లో ఉన్నప్పుడే 'ఢీ' షోతో యాంకరింగ్ మొదలుపెట్టిన మెగా డాటర్ నిహారిక ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్ పెట్టి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' వంటి సిరీస్‌లను చేసింది. 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్‌గా మారి అనంతరం 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది. కానీ ఏది వర్కౌట్ కాలేదు.

ఇప్పుడు హోస్ట్‌గా :ఈ క్రమంలోనే చైతన్య జొన్నల్లగడ్డను పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈమె పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్ కాలేదు. కాపురం మూడు నాళ్ల ముచ్చటైపోయింది. డొవొర్స్ ఇచ్చేసింది. అయితే భర్తతో కలిసి ఉన్న సమయంలో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు నిర్మించింది. ఇక విడాకుల తర్వాత మళ్లీ యాక్టింగ్‌ను కొనసాగించింది. 'డెడ్ పిక్సల్'లో అయితే బోల్డ్ రోల్‌లో కనిపించి మెప్పించేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పుడు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలానే ఆహాలో ప్రసారం కాబోతున్న 'చెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేసేందుకు రెడీ అయింది. ఈ షో మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

అందాల ఆరబోత ఎక్కువైంది :అలా ప్రస్తుతం హోస్టుగా, నటిగా, నిర్మాతగా మళ్లీ బిజీ అవుతున్న నిహారిక సోషల్ మీడియాలోనూ ఎక్కడా తగ్గట్లేదు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. బోల్డ్ ఫొటోషూట్స్ కూడా చేస్తోంది. విపరీతంగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. స్లీవ్‌లెస్‌లు, పొట్టి డ్రెసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు కుర్రాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెగ లైక్స్ షేర్స్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం నా పని ఇదే :ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త పోస్ట్ చేసింది. ఏకాంతంగా ఉన్న తన మెత్తటి బెడ్ ఫొటోను షేర్ చేసింది. దానిపై ఓ పెంగ్విన్ బొమ్మ కూడా ఉంది. ఆదివారం మధ్యాహ్నం నా పని ఇదే అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు డబుల్ మీనింగ్‌లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం మధ్నాహ్నం నీ పని ఇదేనా అంటూ కాస్త తేడా కామెంట్లు రాసుకొస్తున్నారు. కాగా, నిహారిక రీసెంట్గా తమిళంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











