కుర్రాడితో నిహారిక రొమాంటిక్ డ్యాన్స్.. సెక్సీ లుక్స్ చూస్తే మతిపోవాల్సిందే!
మెగా ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ హీరోలందరు వారికంటూ ఒక స్టార్ హోదాను బాగానే సంపాదించుకున్నారు. అలాగే సినిమా సినిమాకు వారి మార్కెట్ స్థాయిని కూడా పెంచుకుంటూ అన్ని వర్గాల అభిమానుల మనసులను గెలుచుకుంటున్నారు. నిహారిక కూడా వారి స్థాయిలో కాకపోయినా జనాలు గుర్తు పట్టేలా బాగానే తన క్రేజ్ని పెంచుకుంది. ఇక ఇప్పుడు మరో డ్యాన్స్ వీడియోతో అమ్మడు అందరిని మరింతగా ఎట్రాక్ట్ చేసింది.

మెగా డేరింగ్ డాటర్..
మెగా డాటర్ నిహారిక నటిగా అడుగులు వేయడం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. మొదట్లో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ వాటి డోస్ పెరగకముందే ఈ మెగా డేరింగ్ డాటర్ తన కెరీర్ పై జనాలకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత నెగిటివ్ రూమర్స్ రాలేవు. అప్పుడప్పుడు వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదు.

వీడియో వైరల్..
నిహారిక చాలా రోజుల తరువాత ఒక విడియోతో అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు అందులో ఉన్నది మెగా డాటర్ నిహారికనేనా అనేలా నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఈ యంగ్ బ్యూటీ ఏ స్థాయిలో హిటెక్కిచిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ డ్యాన్స్ వీడియోకు ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నిహారిక చాలా బాగా డ్యాన్స్ చేసిందని చెబుతున్నారు.

కుర్రాడితో రొమాంటిక్ డ్యాన్స్..
డీ ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ యష్... నిహారికతో కలిసి చేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మనోహర మ్యూజిక్ కి నిహారిక చూపించిన హావభావాలు రొమాంటిక్ గా ఉన్నాయి. ఎక్కడా కూడా వల్గర్ గా అనిపించకుండా ఒక డ్యాన్సర్ గా కూడా నిహారిక తన టాలెంట్ ని చూపించింది. అందుకు సంబంధించిన వీడియోని అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా మొదటిసారి ఇలాంటి డ్యాన్స్ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు మెగా డాటర్ వివరణ ఇచ్చింది.

మరోసారి మెగాస్టార్ సినిమాలో..
ఇదివరకే మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమాలో ఒక గిరిజన యువతిగా కనిపించిన మెగా డాటర్ మరోసారి పెదనాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ అలాగే నిహారిక స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడో తెలియదు గాని మెగా డాటర్ నిహారిక మాత్రం రామ్ చరణ్ కి సోదరిగా కనిపించనుందట. మరి ఆ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











