Sreeja Konidela: నా రోజా నువ్వే అంటూ తనపై ప్రేమను బయటపెట్టిన మెగా డాటర్.. వీడియో వైరల్!

మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అనేక కాంట్రవర్శీల పాలైన తొలి అమ్మాయి ఈమే. ముఖ్యంగా ఈమె తొలిసారి ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత పాప పుట్టాక అతడితో విడాకులు.. ఆ తర్వాత మరో పెళ్లి.. మళ్లీ పాప పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ రెండో భర్తతో కూడా కలిసి ఉండట్లేదు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖఖలతోనే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.అలాగే కల్యాణ్ దేవ్ కూడా తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. వీరు విడాకులు తీసుకోకపోయినా.. వేరువేరుగా ఉంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా శ్రీజ కొణిదెల తన ప్రేమ గురించి వివరించింది. తన జీవితం తనకు అర్థమయ్యేలా చేస్తున్న ఓ వ్యక్తి గురించి వివరించింది. నా రోజా నువ్వే అంటూ చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mega Daughter Sreeja Konidela Reveal Her Love on most Loving Person Check Details

శ్రీజ కొణిదెల రెండోసారి హీరో కల్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. అతడితో ఓ పాపకు జన్మనివ్వగా చాలా హాయిగా వీరి కాపురం సాగింది. ఇక శ్రీజ సెట్ అయింది అనుకునేలోపే.. ఆమె అతడికి దూరం అయింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. తల్లిదండ్రుల వద్దకు వచ్చేసి వారితోనే ఉంటోంది. అయితే వీరి కూతురు మాత్రం కొన్ని రోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజుల్లో తల్లి దగ్గర ఉంటుంది.

ఇదంతా ఇలా ఉండగా.. శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది. నా రోజా నువ్వే అంటూ తన ప్రేమను వ్యక్త పరిచింది.

Mega Daughter Sreeja Konidela Reveal Her Love on most Loving Person Check Details

అంతేకాకుండా తన జీవితం మరింత అర్థవంతం అయ్యేలా చేస్తున్నావంటూ రాసుకొచ్చింది. అయితే తనకు అండగా ఉంటూ ప్రేమను పంచిన వ్యక్తి మరెవరో కాదు.. తన సోదిరి సుస్మితా కొణిదెల. ఆమెతో కిలసి వెకేషన్ కు వెళ్లిన ఈ ముద్దుగమ్మ.. ఆమెతో ఫొటోలు దిగింది. అలాగే వీడియోలు కూడా తీసుకుంది. వీటిని షేర్ చేస్తూనే.. శ్రీజ నా రోజా నువ్వే అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్ వేసి.. అక్కాచెల్లెల్ల అందాలను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X