OTTలోకి వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వీడియో... రూమర్లను ఖండించిన మెగా ఫ్యామిలీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు నవంబర్ ఒకటో తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటలీలో అంగరంగ వైభవంగా వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో ఇటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు అటు అల్లు, త్రిపాఠిల ఫ్యామిలీలు హాజరయ్యారు. అలాగే హీరో నితిన్, ఆయన భార్య, రీతూ వర్మలు హాజరయ్యారు. తాజాగా అంటే నవంబర్ ఐదో తేదీన మెగా కుటుంబ వీరి రిసిప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించింది. వీరి పెళ్లి, రిసిప్షన్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈక్రమంలోనే వీరి పెళ్లి వీడియోను.. మెగా బ్రదర్ నాగబాబు ఓటీటీకి అమ్మేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలోనే విడుదల అవుతుందని అంతా చెప్పారు. ముఖ్యంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన నాగబాబు.. ఈ వీడయోను నెట్ ఫ్లిక్స్ కు 8 కోట్లకు అమ్మేసినట్లు అంతా భావించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. తమ అభిమాన హీరోతో పాటు హీరోయిన్ పెళ్లిని కనులారా చూడవచ్చని పొంగిపోయారు. కానీ ఈ వార్తలపై వీటిపై తాజాగా మెగా కుటుంబ సభ్యులు, వరుణ్ తేజ్ టీం స్పందించారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా వరుణ్ తేజ్ టీం చెప్పింది. అలాగే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా ఇవన్నీ అవాస్తవాలని వివరించారు. ఏ ఓటీటీ వేదికగా కూడా ఈ వీడియో బయటకు రాదని చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని, ముఖ్యంగా ఏది నిజమో, అబద్ధమో తెలుసుకున్నాకే రాస్తే బాగుంటుందని మీడియా మిత్రులకు వివరించారు.
మరోవైపు వీరి రిసిప్షన్ కు టాలీవుడ్ కు చెందిన అనేక మంది నటులు హాజరయ్యారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ జయసుధ, దగ్గుబాటి వెంకటేష్, జగపతిబాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, దిల్ రాజు, సుకుమార్, బోయపాటి శ్రీనివాస్, గుణశేఖర్, శ్రీకాంత్ భార్య ఊహ వంటి వాళ్లంతా పాల్గొన్నారు. నూతన వధూవరును ఆశీర్వదించి అభినందనల వెల్లవ కురిపించారు. వీరి రిసిప్షన్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికీ తరచూ ఓ కొత్త ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











