మరోసారి బయటపడ్డ విభేదాలు? .. పుష్ప 2 ట్రైలర్‌ని పట్టించుకోని మెగా కాంపౌండ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా కుటుంబంలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేయడం ఏంటంటూ మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైనే ఉందని పైకి బిల్డప్ ఇస్తున్నా .. లోపల జరుగుతున్నది వేరంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ట్రైలర్ విడుదల సందర్భంగా మెగా ఫ్యామిలీ మౌనం దాల్చడం చర్చనీయాంశమైంది.
అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి నంద్యాలలో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేయడం వరకు అల్లు అర్జున్ తీరు వివాదాస్పదమైంది. ఈ పరిణామాలతో మెగా , పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దానికి నాగబాబు ట్వీట్.. అల్లు అర్జున్ , స్నేహారెడ్డిల సోషల్ మీడియా ఖాతాలను సాయిథరమ్ తేజ్ బ్లాక్ చేయడం వంటి అంశాలు మరింత కాక రేపాయి. ఇదే సమయంలో పుష్ప-2 విడుదల వాయిదా వేయడంతో బన్నీ ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే మెగా ఫ్యాన్స్‌కు భయపడే పుష్ప-2ని పోస్ట్‌పోన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి దశలో మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన అల్లు అర్జున్ .. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. తన అభిమానులను చూసి తాను హీరో అయ్యానంటూ వాడిన డైలాగ్ ప్రకంపనలు సృష్టించింది. ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చావో మరిచిపోయావని.. చిరంజీవి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం సరికాదంటూ నేటీకీ ట్రోలింగ్ జరుగుతోంది.
ఇక పుష్ప 2ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ పాట్నాలో పుష్ప ది రూల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. రిలీజైన కాసేపటికే పుష్ప 2 వ్యూస్‌లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేవలం 15 గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్ సాధించి మహేశ్ బాబు, ప్రభాస్‌ల రికార్డులను బద్ధలుకొట్టేశాడు పుష్ప రాజ్. తమ హీరో రేర్ ఫీట్ సాధించడంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయిందంటూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ పుష్ప 2 గురించి స్పందించలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయితేజ్, నిహారిక ఇంకా మౌనంగానే ఉన్నారు. ఈ పరిణామాలు మెగా ఫ్యామిలీలో విభేదాలను మరోసారి బయటపెట్టాయని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











