అయోధ్యలో చిరంజీవి ఫ్యామిలీ.. ఆసక్తి రేకెత్తిస్తున్న మెగా కొత్త కోడలు పోస్టు.. ఏం చేసిందంటే?
శ్రీరామ జన్మభూమి అయోధ్య గురించి.. అక్కడ ఈరోజు జరుగుతున్న వేడుక గురించి ప్రపంచమంతా తెలిసిందే. ముఖ్యంగా భారతదేశ ప్రజలంతా ఎంతో సంబురంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయోధ్య వెళ్లలేని వాళ్లంతా తమ దగ్గర్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు అయితే నేరుగా అయోధ్య వెళ్లి రాముడి ప్రాణప్రతిష్టను కళ్లారా వీక్షించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలికీ చెందిన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లు అయోధ్య వెళ్లగా.. మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. అది కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసింది. జీవితాంతం ప్రజలందరికీ గుర్తిండిపోయేలా చేస్తున్న ఈ వేడుకులకు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు కొందరు హాజరయ్యారు. ఇప్పటికే రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లు వెళ్లారు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన ఐదుగురు అక్కడకు వెళ్లగా.. ఆ ఇంటి కొత్త కోడలు ఓ పోస్ట్ పెట్టింది.

ముఖ్యంగా అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. టాలీవుడ్ హీరోయిన్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి.. ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె గోల్డ్ కలర్ చీర కట్టుకొని మెరిసిపోయింది. అయితే ఈ ఫొటోలు చూస్తున్న ప్రతీ ఒక్కరి కన్ను.. ఆమె అందం, ఆమె చీరమీద కాకుండా చాలా ఆమె జ్యువెల్లరీపైకి వెళ్లాయి. ముఖ్యంగా ఆమె వేసుకున్న జ్యువెల్లరీలో శ్రీ రామ చంద్రుడి రూపం ధగధగా మెరుస్తోంది. ముఖ్యంగా శ్రీసీతారాముల లాకెట్ తో ఉన్న ఈ నెక్లెస్ మరింత స్పెషల్ గా కనిపిస్తుంది.
కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా.. శ్రీరామ చంద్రుడి గురించి.. ఈరోజు జరుగుతున్న వేడుకల గురించి కామెంట్లు చేసింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగడం చూస్తుండడం తన అదృష్టం అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇలాంటి స్పెషల్ రోజుల రామ్ పరివార్ నగలు ధరించడం ఈ సంతోషకరమైన సందర్భానికి వ్యక్తిగత స్పర్శను కూడా జోడిస్తుందంటూ వివరించింది. దేశ పౌరులందరినీ ఏకం చేసే సమయం ఇది అని.. ముఖ్యంగా భారతీయులందరిలో ఐక్యతా భావాన్ని పెంపొందించుకోవాలనే చెప్పుకొచ్చింది.

అలాగే దేశ ప్రజలందరి పెదవులపై చిరునవ్వు హృదయాలపై శ్రీరాచంద్రుడిపై భక్తి ఉండాలని తెలిపింది. అయోధ్యతో పాటు భారతదేశం అంతటా శాంతి, అవగాహన, సద్భావన వెల్లివిరియాలని ప్రార్థిద్దాం అంటూ చివరగా జై శ్రీరామ్ అని చెప్పుకొచ్చింది. లావణ్య త్రిపాఠి వేసుకున్న నగలు, ఆమె చేసిన కామెంట్లు చూస్తుంటే.. ఆమెకు రాముడిపై ఉన్న ప్రేమ, భక్తి తెలుస్తోంది. మెగా కొత్త కోడలు చేసిన ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











