Just In
Don't Miss!
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- News
SP Balu "భారత రత్నం" కాడా..? పద్మవిభూషణ్‌తో సరిపెట్టిన కేంద్రం
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిహారిక పెళ్లి తరువాత బిగ్ పార్టీ ప్లాన్.. ఒక్క కారణంతో మొత్తం చెడిపోయింది!
2020 శ్రీకాంత్ అడ్డాల సినిమా మాదిరిగా చాలా కూల్ గా మొదలై మధ్యలో మాత్రం సుకుమార్ సినిమా కంటే ఊహించని ట్విస్టులతో షాక్ ఇచ్చింది. ఇక కరోనా వచ్చిన తరువాత RGV సినిమా మాదిరిగా మరణ బయలను కలిగించింది. చివరికి ఏండింగ్ అయినా శేఖర్ కమ్ముల సినిమా లాగే సెలబ్రేషన్స్ ఉంటాయని అనుకుంటే శంకర్ సినిమా లాగా సీక్వెల్ ప్లాన్ చేసేలా ఉందని తెలుస్తోంది. ఇక 2021 న్యూ ఇయర్ ఈ సారి బ్యాడ్ ఇయర్ లాగానే మొదలయ్యేలా ఉందనిపిస్తోంది.

ఇప్పుడు మాత్రం వేడుకలు కనిపించవు.
కరోనా వైరస్ కారణంగా ఈ న్యూ ఇయర్ కాస్త ఇబ్బందిగానే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టార్స్ అయితే ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ ఒకటి. ఇటీవల నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ మొత్తం ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి వేడుకలు కనిపించవు.

నిహారిక పెళ్లి తరువాత..
న్యూ ఇయర్ కోసం ఈ సారి మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కపుల్స్ అందరికి మరొక పార్టీ ఇవ్వాలని అనుకున్నారట. నిహారిక పెళ్లి కోసమని ఉదయ్ పూర్ కు దాదాపు 100మంది కుటుంబ సభ్యులతో కలిసి వెల్లిన మెగా కుటుంబ సభ్యులు కరోనా వైరస్ ను దాటి పెళ్లికి ఎలాంటి ఆటంకం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఆ వేడుక తరువాత మరో వేడుక కోసం బాగానే ప్లాన్ చేసుకున్నారట.

రామ్ చరణ్ కు పాజిటివ్ అని తేలడంతో..
ఇక దాదాపు కరోనా ఎండ్ అవుతోంది అనుకున్న సమయంలో మళ్ళీ వైరస్ కొత్త తరహా పంజా విసురుతోంది. ఇటీవల రామ్ చరణ్ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. అందరూ టెస్టులు చేయించుకున్నారు. ఈ దూరం వల్ల వారి న్యూ ఇయర్ ప్లాన్స్ మొత్తం తారుమరయ్యాయి.

ప్లాన్ మొత్తం చెడిపోయింది
ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా రీసెంట్ గా కరోనా భారిన పడటం అందరిని షాక్ కు గురి చేసింది. ఎంతగానో జాగ్రత్తగా ఉంటూ నిత్యం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటు వర్కౌట్స్ చేసే హీరోలకు కూడా కరోనా వస్తోంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మెగా ఫ్యామిలీ ఈ సారి ఎంతో గ్రాండ్ గా 2021కు వెల్కమ్ చెప్పుకోవాలని పార్టీ ప్లాన్ చేసుకోగా ఒక్కసారిగా ప్లాన్ మొత్తం చెడిపోయింది.