Allu Vs Mega: నష్టాలకు సిద్దపడే రాంచరణ్‌తో మూవీ.. అల్లు అరవింద్ కామెంట్లతో ముదిరిన మెగా విభేదాలు!
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ ఫ్యామిలీలు అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకొన్నాదా? అనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇరు కుటుంబాల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్దం ప్రస్తుతం ప్రత్యక్ష యుద్దానికి తెర లేపిందా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గలాటా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రచ్చగా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారనే విషయంలోకి వెళితే..
గత కొద్దికాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయనే విషయం అంతర్గతంగా చర్చ జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ ఘటనతో రెండు కుటుంబాలు చీలిపోయాయనే మాట బలంగా వినిపించింది.

అయితే పుష్ప 2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన తర్వాత అల్లు అర్జున్ వివాదంలో పీకల్లోతు కూరుకుపోవడం.. మెగా ఫ్యామిలీ ఆ ఘటనకు సమదూరం పాటించడంతో మరోసారి చర్చ జరిగింది. కానీ ఐకాన్ స్టార్ అరెస్ట్ తర్వాత మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబాన్ని పరామర్శించడంతో వారి మధ్య సాన్నిహిత్యం బయటకు వచ్చింది.
ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య మిక్స్‌డ్ రియాక్షన్ సీన్లు కొనసాగుతుండగానే.. ఇటీవల ఓ ఫంక్షన్‌లో అల్లు అరవింద్ తన మేనల్లుడు నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం గురించి పరోక్షంగా ట్రోల్ చేసినట్టు మాట్లాడటం వివాదంగా మారింది. దిల్ రాజును ఉద్దేశించి ఒక సినిమాను కిందికి తొక్కేసి.. మరో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఐటీ వాళ్లను పిలిపించుకొని వారం రోజులపాటు రచ్చ చేశాడు అంటూ ఆయన కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మనస్తాపం చెందారు.

ఇదిలా ఉండగానే.. గలాటా ఛానెల్ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని, అభిమానుల మనోభావాలను దెబ్బ తీసినట్టు ఉండటం మరింత వివాదం మారింది. నా మేనల్లుడు నటించిన తొలి సినిమా సరిగా ఆడలేదు. ఆయన కోసం హిట్ సినిమా తీయాలని అనుకొన్నాను. రెండో సినిమా కోసం భారీగా బడ్జెట్ పెట్టాను. మగధీర సినిమా నష్టం వస్తుందనే ఎక్కువగా ఖర్చు చేశాను. కానీ ఊహించని విధంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అని అన్నారు.
అయితే రాంచరణ్ నటించిన తొలి సినిమా చిరుతను ఫ్లాప్ అని అరవింద్ పేర్కొనడంపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో డెబ్యూ హీరోగా రాంచరణ్ అత్యధిక కలెక్షన్లు సాధించాడు. అలాంటి సినిమాను ఫ్లాప్ సినిమా అని ఎలా అంటాడు. నష్టపోతాననే మగధీర సినిమాకు బడ్జెట్ ఖర్చు చేశానని ఎలా చెబుతాడు అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











