మెగా vs అల్లు వివాదం.. రామ్ చరణ్ సీరియస్.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్!

కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. మెగా సపోర్టుతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీని పట్టించు కోవడం లేదంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా మెగా ఫ్యాన్స్ కు గట్టిగా సమాధానం ఇచ్చారు. అయితే ఈ వివాదానికి కారణమైన వ్యక్తి మీద రామ్ చరణ్ తేజ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

పవన్ ను సీఎం చేయాలనీ

పవన్ ను సీఎం చేయాలనీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను 2024 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మెగా అభిమానులు అందరూ కలిసి పని చేయాలని భావిస్తూ తాజాగా విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడలో మురళి ఫార్చ్యూన్ హోటల్ లో ఆదివారం నాడు సమావేశమైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానుల సంయుక్త సమావేశంలో అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం వ్యవస్థాపకుడు స్వామి నాయుడు, ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మహేష్, రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్, సినీ దర్శకుడు బాబీ తదితరులు పాల్గొన్నారు.

కోపం తెప్పించే విధంగా

కోపం తెప్పించే విధంగా


ఈ సందర్భంగా మెగా అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇదే సమావేశంలో భాగంగా అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ మాత్రం అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండా గతంలో ఒక ఈవెంట్ లో ఆయన పేర్కొన్న చెప్పను బ్రదర్ అనే పదాన్ని పదేపదే పేర్కొంటూ అల్లు అర్జున్ అభిమానులకు కోపం తెప్పించే విధంగా మాట్లాడారు.

 క్షమాపణ చెబుతూ

క్షమాపణ చెబుతూ

అల్లు అర్జున్ అభిమానులు కూడా ఏం పీకలేరు బ్రదర్ అంటూ వారికి కౌంటర్ ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ట్రేండింగ్ చేశారు. ఈ విషయం రామ్ చరణ్ వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవాని రవికుమార్ అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.

ఆగ్రహం వ్యక్తం చేసి

ఆగ్రహం వ్యక్తం చేసి


'తాజాగా జరిగిన సమావేశంలో తాను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ గారు అని సంబోధిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని అనిపిస్తోందని ఈ విషయం మీద రామ్ చరణ్ గారు కూడా తన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది అని రవి కుమార్ పేర్కొన్నారు.

ఎంత వరకు వెళుతుందో

ఎంత వరకు వెళుతుందో


ఎప్పుడో జరిగి పోయిన విషయాన్ని ప్రస్తావించడం కరెక్ట్ కాదని చెబుతూనే రాంచరణ్ సహో మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు తనను క్షమించాలని ఆయన కోరారు. అయితే ఈ వీడియో విడుదలైన తర్వాత కూడా అల్లు అర్జున్ అభిమానులు ఎక్కడ వెనక్కి తగ్గినట్టు కనిపించినా లేదు. మరి చూడాలి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X