మెగా ఫ్యామిలీ మనోభావాలకు విరుద్ధంగా.. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై మెగా ఫ్యాన్స్ ఫైర్

చెప్పను బ్రదర్ వివాదం, రీ ఎంట్రీలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయకపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పరిణామాలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలు పంపుతున్నాయి. అయితే కుటుంబమంతా ఒక్కతాటిపైనే ఉందంటూ పైకి కలరింగ్ ఇస్తున్నారని ఫిలింనగర్‌లో డిస్కషన్ జరుగుతోంది. తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలని, మెగా హీరో ట్యాగ్‌లైన్ తనకు అక్కర్లేదన్నంట్లుగా అల్లు అర్జున్ గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన వ్యవహారశైలి అభిమానుల మధ్య విభేదాలకు కారణమవుతోంది.

గతంలో జరిగిన విషయాలేమో కానీ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడాన్ని మాత్రం మెగా క్యాంప్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నాగబాబు ట్వీట్ దీనికి పరోక్ష సంకేతమంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. '' మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడు, మాతో నిలబడేవారు పరాయివాడైనా మావాడే .. '' నంటూ ఆయన అల్లు అర్జున్ పేరెత్తకుండా ఇన్‌డైరెక్ట్‌గా తన ఉద్దేశ్యం ఏంటో చెప్పేశాడు.

Mega Fans fires on allu arjun due to supporting him to shilpa Ravi Chandra Kishore Reddy

ఇక సోషల్ మీడియాలో బన్నీపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్‌డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు. మెగా హీరోలందరిలోకి స్టైలీష్‌గా ఉండటం వల్లే బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎదిగాడంటూ వారు కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు.. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన, ఏపీలో ఎన్నికలు, నాగబాబు ట్వీట్ తదితర పరిణామాల నేపథ్యంలో ఓ తెలుగు వార్తాసంస్థ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిలేష్ అనే మెగా అభిమాని,జనసైనికుడు అల్లు అర్జున్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Mega Fans fires on allu arjun due to supporting him to shilpa Ravi Chandra Kishore Reddy

పవన్ స్థాయికి తాను ఎదిగిపోయినట్లుగా బన్నీ భావిస్తున్నారని.. ఈ జన్మే కాదు ఇంకో పది జన్మలెత్తినా పవన్ స్టాయి అల్లు అర్జున్‌కి రాదన్నారు. పవన్ కళ్యాణ్ స్థాయి రావాలంటే మళ్లీ పవన్ కళ్యాణే పుట్టాలని.. ఇలాంటి మైండ్‌లెస్, సెన్స్‌లెస్ పనిని అల్లు అర్జున్ చేశారని నిలీష్ దుమ్మెత్తిపోశారు.

గంగోత్రి రిలీజ్ నాడు అల్లు అర్జున్ ఏమన్నారో అందరికీ తెలుసునని.. తామంతా శ్రమించి ఆయనను స్టైలీష్ స్టార్‌‌ను చేశామని, మళ్లీ గంగోత్రి నాటి స్థితికి వెళ్తామంటే ఆయన ఇష్టమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పదేళ్లుగా కష్టపడుతున్నారని.. సొంత కుటుంబ సభ్యుడు అంతగా శ్రమిస్తుంటే సరదాగా వెళ్లి ఫ్రెండ్‌కి సపోర్ట్ చేస్తానంటే కుదరదన్నారు. ఈ ఇష్యూని జనసైనికులు సరదాగా తీసుకుంటారా అని నిలీష్ ప్రశ్నించారు.

Mega Fans fires on allu arjun due to supporting him to shilpa Ravi Chandra Kishore Reddy

పిఠాపురం జనానికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ఆయన నిలదీశారు. సొంత కుటుంబ సభ్యులే పవన్ కోసం కష్టపడుతుంటే.. కావాలనే అల్లు అర్జున్ ఇలా చేశారని నిలీష్ ఆరోపించారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు సహజమని.. కానీ దానికి సమయం, సందర్బం ఉంటాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలు అల్లు అర్జున్ రాబోయే సినిమా పుష్ప -2పై ప్రభావం చూపుతాయేమోనన్న చర్చ జరుగుతోంది. గతంలో బన్నీ నటించిన ఓ సినిమా మెగాభిమానుల ఆగ్రహానికి గురైంది. హిట్ కావాల్సిన ఆ బొమ్మ డిజాస్టర్‌గా మిగిలింది. మరి ఫ్యాన్స్‌ని శాంతింపజేసేందుకు అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X