అదేం పిలుపురా బాగా ఎక్కువైంది మీకు.. మెగాస్టార్ అని అనలేవా?.. అల్లు శిరీష్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఫ్యాన్స్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు. అది ఏ హీరో అభిమానులు అయినా సరే. వారి ఆగ్రహానికి ఓ పట్టానా సరైనా కారణాలంటూ ఉండవు. తమ హీరోను కించపరచడమో, తక్కువ చేసి మాట్లాడటమో, సరైన విధంగా సంభోదించకపోవడమో, మరేతర కారణాలైనా కావొచ్చు.. అంతే అభిమానులు రంగంలోకి దిగి అవతల వారిని ఎడాపెడా వాయిస్తుంటారు. మెగా ఫ్యాన్స్ అసలే అల్లు ఫ్యామిలీ మీద గరంగరం ఉన్నారని వార్తలు వస్తుండంగా.. అల్లు శిరీష్ చేసిన కామెంట్స్, మెగాస్టార్ చిరంజీవిని సంభోదించిన విధానంపై మెగా ఫ్యాన్స్ అంతెత్తున లేచారు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

రక్తందనాం చేయాలని పిలుపు..
లాక్ డౌన్ వేళ రక్త దాతల సంఖ్య గణనీయంగా తగ్గిందని, రక్తం ఇచ్చేవారు లేక కొరత ఎక్కువగా ఉందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తానే ముందుకు వచ్చి రక్తదానం చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. తలసేమియా-క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు.. బైపాస్ సర్జరీ - హార్ట్ రోగులు.. ప్రమాదాలకు గురైన వారు.. ఎనీమియా వంటి సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చాడు.

స్పందించిన అల్లు శిరీష్..
రక్తదానం చేయాలని చిరంజీవి ఇచ్చిన పిలుపుకు అల్లు శిరీష్ స్పందించాడు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోకు రిప్లై ఇస్తూ.. డన్ కేసీ గారు.. వీలైనంత తొందరగా మీరు చెప్పినట్టు చేస్తామని ఓ నమస్కారం పెట్టేశాడు. అయితే ఇందులో అంతగా బాధపడాల్సిన అంశమేమీ లేకపోయినా.. మెగాస్టార్‌ను సంభోదించిన తీరుకు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
అదేం పిలుపురా..మీకు బాగా ఎక్కువైంది
అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న విబేధాలు మరోసారి ఈ విషయంగా బయట పడ్డాయి. కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే కాదు అల్లు ఫ్యామిలీ ఇందులోకి లాగేశారు. అదేం పిలుపురా..మెగాస్టార్ అని పిలువు.. ఒక్క హిట్ వచ్చే వరకు అల్లు ఫ్యామిలీ ఆగడం లేదు అంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు.
Recommended Video

వివరణ ఇచ్చిన అల్లు శిరీష్..
ఇక ఇలాంటి కామెంట్లను తట్టుకోలేక దెబ్బకు అల్లు శిరీష్ దిగొచ్చాడు. కేసీ గారు అని పిలిచారేంటి? అని అడిగే వారందరికీ ఇదే సమాధానం అంటూ ఓ ట్వీట్ చేశాడు. మా ఫ్యామిలీ సర్కిల్‌లో చిరంజీవి గారిని కేసీ గారు కేసీ సర్ అని సంభోదిస్తామని స్పష్టం చేసి ఓ దండం పెట్టేశాడు.


Click it and Unblock the Notifications











