Game Changer: గేమ్ ఛేంజర్‌పై అనుచిత కామెంట్.. అల్లు అరవింద్‌పై మెగా ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోస్ దాదాపు కొన్ని కుటుంబాల నుంచి మాత్రమే ఉన్నారని అందరికీ తెలిసిందే. వారిలో మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోస్ కూడా అనేకం. అయితే ఒకప్పుడు మెగా కుటుంబం వేరు ఇపుడు మెగా కుటుంబం వేరు అందరికీ తెలిసిందే. కాగా ఒకప్పుడు మెగా అంటే అల్లు కుటుంబం నుంచి హీరోస్ కూడా అని బ్రాండ్ ఉండేది.
కానీ నెమ్మదిగా అల్లు కాంపౌండ్ నుంచి కొన్ని చర్యలు ఒకొక్కటిగా చీలికలు తీసుకొచ్చాయి. కాగా ఈ చర్యలతో మెగా హీరోల అభిమానులు కూడా వేరు కావడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ కాంట్రవర్సీ అంతటికీ అల్లు అర్జున్ తీసుకున్న స్టాండ్ ఒకెత్తు అయితే అప్పుడు నుంచి అంతా అల్లు అర్జున్ మాత్రమే ప్రధాన కారణం అనుకున్నారు కానీ ఇపుడు ఏకంగా నిర్మాత అల్లు అరవింద్ కూడా మెగా పట్ల చూపించిన విద్వేషం ఇలా ఉందంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ ఛేంజర్ విఫలం కావడంతో దీనిపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాగా అల్లు అరవింద్ నిర్మాత దిల్ రాజుతో చేసిన కామెంట్స్ తో సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి ఇలా ఒకటి అలా అంటూ వెటకారంగా చేసిన కామెంట్స్ తో మెగా అభిమానులు ఫైర్ అవుతూ మెగా హీరోస్ ఫెయిల్యూర్స్ పట్ల ఇంత విద్వేషం దాచుకున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయం చిరంజీవి ఎంతో ప్రోత్సాహం అందించారు కానీ తీరా ఇపుడు మెగా కుటుంబం నుంచి హీరోలు ఫెయిల్యూర్స్ లో ఉంటే అందరి ముందు అవమానకరంగా మాటలు అంటున్నారని మెగా అభిమానులు ఈ విషయంలో మాత్రం చాలా డిజప్పాయింట్ గా ఉన్నారు. ఇక వీటితో పాటుగా పలు క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక సందర్భంలో అల్లు రామలింగయ్య గారు చిరంజీవి నటించిన "స్టేట్ రౌడీ" సినిమా పోయింది పోయింది అంటూ ఇంట్లో కామెడీ చేస్తే చిరంజీవి గారు ఆ మాటలకి ముఖం చిన్నబోయింది అని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పిన క్లిప్ బయటకి వచ్చింది. కానీ ఆ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్స్ బయటకి వచ్చాక అల్లు రామలింగయ్య గారికి చెప్తే నాకేం తెలుసు అందరు సినిమా పోయింది అన్నారు నేనూ పోయింది అన్నాను అని చెప్పారు అని తెలిపారు.
అలాగే అల్లు అర్జున్ కూడా జులాయి సినిమా ఈవెంట్ లో ఓ హీరో సినిమా పోవాలని కోరుకున్నాను అని చెప్పిన సందర్భాన్ని కూడా వైరల్ చేస్తున్నారు. అప్పుడు వారు ఇపుడు అల్లు అరవింద్ నుంచి కూడా అదే తరహా కామెంట్స్ రావడంతో అంతా షాకవుతున్నారు. ఇప్పటికి అయినా మెగాస్టార్ వీరిని దూరం పెట్టాలని కూడా మెగా అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











