మెగా అభిమానులను టెన్షన్ పెడుతున్న రన్ టైమ్.. ఏం చేయబోతున్నారు?
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో 'వాల్మీకి' సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 51 నిమిషాలు అని తెలుస్తోంది. వాస్తవానికి దీని మాతృక అయిన 'జిగర్తాండ' మాత్రం 2 గంటల 38 నిమిషాల మాత్రమే ఉంది. అయితే, 'వాల్మీకి'ని ఎందుకు అంతగా పొడిగించారో మాత్రం అర్థం కావడం లేదు. దీంతో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. యంగ్ రెబెల్ స్టార్ నటించిన 'సాహో'కు సైతం రన్ టైమ్ వల్ల నెగెటివ్ రివ్యూలు వచ్చాయని.. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ కొందరు ఆందోళన చెందుతున్నారని టాక్.


Click it and Unblock the Notifications











