twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిపై అశ్వనీదత్ ఫైర్.. ఆ వ్యాఖ్యల వెనుక అసలు మ్యాటర్ అదేనట..

    |

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిరు నిర్ణయాన్ని సినీ నిర్మాత అశ్వనీదత్‌ తప్పుబట్టి.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మెగాస్టార్‌ను ఏకిపారేసిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవినే అలా అంటాడా? ఆయన లేకపోతే అశ్వనీదత్ పరిస్థితి ఏంటని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.

    రైతులకు మద్దతుగా..

    రైతులకు మద్దతుగా..

    అమరావతిలో రైతులు మూడు రాజధానులు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్నసమయంతో నిర్మాత అశ్వనీదత్ వారికి మద్దతు తెలిపాడు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న రైతుల శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపాడు. అయితే మూడు రాజధానులు ఉండటం మంచిదే అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి, పృథ్వీ, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఘాటైన కామెంట్లు చేశారు.

    ఆయనకేం తెలుసు..?

    ఆయనకేం తెలుసు..?

    చిరంజీవికి రాజకీయాల గురించి, రాజధాని నిర్మాణం గురించి ఏం తెలుసు? ఏం తెలిసి మూడు రాజధానుల గురించి మాట్లాడాడు? ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన వారెవ్వరూ కూడా వాటిని సమర్థించరని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో బహుళ రాజధానుల వ్యవస్థ విఫలమైన విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించాడు. పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమాలో నటిస్తే వందకోట్లు వస్తాయి.. ఆయన సినిమాలు వదిలేసి గత ఆరేళ్లుగా రైతుల కోసం పోరాడుతున్నాడని చెప్పుకొచ్చాడు.

     అసలు విషయం వేరే ఉందట..

    అసలు విషయం వేరే ఉందట..

    అమరావతికి అనుకూలంగా అశ్వనీదత్‌ మాట్లాడడం వెనుక అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది. అమరావతి పరిధిలో భూములు ఉండటం వల్లనే రాజధాని ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాడనే వాదన రాజకీయ వర్గాల్లోనూ, అలాగే సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది. అందుకే మూడు రాజధానుల ఏర్పాటును అశ్వనీదత్ వ్యతిరేకిస్తున్నాడని అంటున్నారు.

    Recommended Video

    Chiranjeevi's Shocking Decision On Anchor Anasuya
     అందుకే చిరుపై వ్యాఖ్యలు..

    అందుకే చిరుపై వ్యాఖ్యలు..

    అందుకే తనకు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు అయిన చిరంజీవిని తిట్టడానికి కూడా అశ్వనీదత్ వెనుకాడ లేదని సమాచారం. తాజాగా చిరంజీవిని టార్గెట్ చేసుకొని చేసిన వ్యాఖ్యల అనంతరం వారిద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని మాట కూడా వినిపిస్తున్నది. ఏది ఏమైనా ఇద్దరు సన్నిహితుల మధ్య రాజధాని అంశం చిచ్చు పెట్టిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

    English summary
    Mega Fans Trolls On Aswini Dutt About Comments On Chiranjeevi In 3 Capitals Disputes. He Slams Chiranjeevi Decission Over Accepting 3 Capitals For Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X