Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రూమర్స్ కు కౌంటర్ ఇచ్చిన మెగా అల్లుడు.. ఎమోషనల్‌గా కిన్నెరసాని ఫస్ట్ గ్లింప్స్..
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలు అందుకోవడం అంటే చాలా కష్టమైన పనే. ఒకవేళ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పుడు అంచనాలను ఆదుకోవాలన్నా కూడా కష్టమే. ఈ రోజుల్లో టాలెంట్ తో ఆడియెన్స్ మనసును ఎట్రాక్ట్ చేసిన నటినటులే స్టార్ గా ఎదుగుతారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రమోషన్ అవసరం ఉన్నా కూడా అతను మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా కోరడం లేదంటే ఎంత నిబద్దతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ ఉంటే..కలెక్షన్స్ ఊరికే రావు
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు అంటే ఎంతైనా ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో నలుగురు అతనికి రెస్పెక్ట్ ఇవ్వడంతో పాటు అవకశాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అవకాశం దొరికినంత ఈజిగా సక్సెస్ దొరకదు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఊరికే రావు అని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం
కళ్యాణ్ దేవ్ కూడా సహాయం కొరకుండా..
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మొదట విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా మొదట కొంత పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ విజయాన్ని అందుకోవాలని కళ్యాణ్ కష్టపడుతున్నాడు. ఆ సినిమాకు ఏ మెగా హీరో కూడా సింగిల్ ట్వీట్ వేసి సపోర్ట్ చేయలేదు. ఎందుకు? అలా ఉన్నారో ఏమో గాని కళ్యాణ్ కూడా ఎప్పుడు వారి నుంచి సహాయం కోరడం లేదట.
ఆ సినిమా ఆగిపోలేదు..
ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. సూపర్ మచ్చి సినిమా షూటింగ్ పూర్తయ్యింది గాని ఇంకా రిలీజ్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక మరో సినిమాను మొదలు పెట్టిన కొన్ని రోజులకే అపెయ్యాల్సి వచ్చిందని మొన్నటి వరకు రూమర్స్ వచ్చాయి. అశ్వథ్థామ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రమణతేజతో ఇటీవల కిన్నెరసాని అనే ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమా ఆగిపోలేదు.
కిన్నెరసాని ఏమోషనల్ గ్లింప్స్
ఇక న్యూ ఇయర్ సందర్భంగా కిన్నెరసాని సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసి రూమర్స్ కు చెక్ పెట్టాడు ఈ కుర్ర హీరో. దీనంగా ఒక చెట్టుకింద పడుకొని ఉండగా వర్షం రావడం వంటి సీన్ ను చూస్తుంటే కథ చాలా ఎమోషనల్ గా తెరకెక్కేలా ఉందని అనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కళ్యాణ్ దేవ్ ఎదో కొత్త తరహా సినిమాతో ఆకట్టుకోబోతున్నట్లు అర్ధమవుతోంది.