అంబానీ పెళ్లి వేడుకలో నాటు నాటు దుమారం.. ముగ్గురు ఖాన్‌లతో మెగా హీరో స్టెప్పులు!
ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా.. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రతీ విషయం తెగ వైరల్ అవుతోంది. కానీ వీటన్నిటికీ మించి ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాటు నాటు పాటకు ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే వీడియో కనిపిస్తోంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అపర కుభేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతోన్న ఈ వేడుకకు అనేక మంది స్టార్ నటీనటీలు హాజరు అయ్యారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు టాలీవుడ్ కు చెందిన ఒకే ఒక్క హీరో ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

ఆయన మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే స్టేజీపైకి వెళ్లిన ఈయన ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సందడి చేశారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ లు ముగ్గురూ కలిసి తొలిసారి ఒకే స్టేజీ మీదకు చేరారు. ఆ తర్వాత అక్కడకు రామ్ చరణ్ కూడా వచ్చారు. ఇలా నలుగురు స్టార్ హీరోలు ఒక్క చోట చేరగా.. మంచి మంచి పాటలు ప్లే చేశారు.
ఆ తర్వాత ఈ ఈవెంట్ లో నాటు నాటు పాట వేశారు. ఇలా ఈ స్టార్ హీరోలు అంతా కలిసి ఈ పాటకు స్టెప్పులు వేశారు. ఆ తర్వాత వేర్వేరు పాటలు ప్లే చేయగా.. తమ సినిమాల్లోని హుక్ స్టెప్పులను వేశారు. ఇలా చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తెలుగు పాటకు ముగ్గురు ఖాన్ లు స్పెషల్ స్టెప్పులు వేయడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు.

అలాగే ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలను ఒక్క చోట చేర్చిన ఘనత ఒక్క అంబానీకే సాధ్యం అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ చూస్తుంటే తెగ సంతోషంగా అనిపిస్తుందంటూ తెలుగు సినీ ప్రియులు వివరిస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తే మీకు ఏం అనిపిస్తుందో చెప్పండి.


Click it and Unblock the Notifications











