కూతురి గురించి రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. పేరు పెట్టేది అప్పుడే.. ఎవరిలా ఉందంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు పాప పుట్టిన సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చాలా రోజులుగా ఉపాసన చరణ్ కు పుట్టబోయే బిడ్డకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి జూలై 20వ తేదీన ఈ దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇక ఇప్పుడు మెగా అభిమానులు కూడా ఈ శుభవార్తను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పాప పుట్టిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్ తన ఆనందాన్ని తెలియజేశారు. ఇక ఆయన ఇంకా ఏం తెలియజేశారు అనే వివరాల్లోకి వెళితే..
మెగా ఇంటికి మహాలక్ష్మి : అపోలో హాస్పిటల్ లో ఉపాసన తన బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ముందు రోజు నుంచే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ లోనే ఎక్కువగా ఉన్నారు. ఇక పాప పుట్టింది అని తెలియగానే చాలామంది సినిమా సెలబ్రిటీలు అలాగే యువ హీరోలు ప్రముఖ దర్శకులు కూడా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మీడియా ముందుకు వచ్చి మా ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చింది అని ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

మీడియా ముందుకు వచ్చిన చరణ్ : ఇక పాప పుట్టిన తర్వాత మొదటిసారి రామ్ చరణ్ తేజ్ మీడియా ముందుకు వచ్చి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అభిమానుల ఆశీస్సులు మీ అందరి దీవెనలు కూడా నాతో ఎప్పటికీ ఉంటాయి అని అందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని రామ్ చరణ్ తేజ్ వివరణ ఇచ్చాడు. ఉపాసన అలాగే పాప ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు అంటూ రామ్ చరణ్ మాట్లాడారు.

నేను ఎప్పటికీ మర్చిపోలేను : అభిమానులు మాపై చూపించే ప్రేమ అలాగే వారు చేసే పూజలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే మా శ్రేయోభిలాషులు మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కు కూడా చాలా ధన్యవాదాలు. వారి దీవెనలు ఎప్పుడు మా పాపపై ఉంటాయి. ఇంతకంటే ఆనందం మరొకటి నాకు ఉండదు. ఈ సమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీస్సులు కూడా మా పాపకు ఉండాలి అని అన్నారు.

పేరు గురించి అప్పుడే చెబుతాను : పాపకు ఏం పేరు పెడుతున్నారు అనే ప్రశ్నను మీడియా మిత్రులు అడగగా రామ్ చరణ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. సాంప్రదాయాల గురించి ఎక్కువగా తెలియదు కానీ కానీ పేరు మాత్రం 12వ రోజు లేదా 20వ రోజు ఒక ప్రత్యేకమైన వేడుకలో తెలియజేయవచ్చు. అయితే నేను ఉపాసన ఇప్పటికే ఒక ఒక పేరు అనుకున్నాము. కానీ అందరం డిసైడ్ అయిన తర్వాత ఆ పేరు గురించి తెలియజేస్తాము. చెప్పాల్సిన రోజు నేనే అందరికీ చెబుతాను అని రామ్ చరణ్ ఉన్నాడు.

పాప ఎవరి పోలిక అంటే : ఇక ఫస్ట్ టైం పాపను చూడగానే నేను చాలా ఆనందపడ్డాను. ఒక తండ్రి తన బిడ్డను ఎలాగైతే మొదటిసారి చూసినప్పుడు ఎంతగా సంతోషిస్తాడో నేను అదే భావనను ఫీలయ్యాను అని అన్నారు. ఇక పాప ఎవరి పోలిక అనే ప్రశ్నకు రామ్ చరణ్ తన పోలిక అంటూ చాలా సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తాను అని అప్పటివరకు అందరికీ కృతజ్ఞతలు అని రాంచరణ్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











