Sai Dharam Tej: ఎంత పని చేశావ్‌రా వరుణ్.. నీకు పెళ్లి సంబురాలు, నాకు పోరాటం - మెగా మేనల్లుడి పోస్ట్ వైరల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటలీలోని టుస్కానీలో అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా రిసిప్షన్ కూడా పెట్టింది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. పెళ్లికి రెండ్రోజుల ముందు నుంచి వారం రోజుల పాటు ఎక్కడ చూసిన వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలే దర్శనం ఇచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే వీరి పెళ్లి గురించి అంతా చర్చ ఆపేస్తుండగా.. మెగా మేనల్లుడు చేసిన ఓ పోస్ట్ తో మరోసారి వీరి పెళ్లి న్యూస్ వైరల్ అయింది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా, అల్లు ఫ్యామిలీలో ఎలాంటి సంబురాలు జరిగిన వీరంతా కలుస్తూనే ఉంటారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లిలో పుల్లుగా హడావుడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అందులో ఆయన వరుణ్ తేజ్, లావణ్య వివాహంలో దిగిన ఫొటోను షేర్ చేసి కింద ఓ మ్యాటర్ కూడా రాసుకొచ్చాడు. వరుణ్ ను తీసుకొస్తున్న కారు ముందు నిల్చున్న సాయి ధరమ్ తేజ్ కారుపై కాలు పెట్టి మరీ నిలబడ్డాడు.

లైట్ పింక్ కలర్ కుర్తా వేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఓ వాచ్, అద్దాలు పెట్టుకున్నాడు. అలాగే వరుణ్ ను ఏదో అడుగుతుండగా ఈ ఫొటో తీసినట్లు చూస్తుంటేనే అర్థం అవుతుంది. వెనకాల ఉన్న నిహారిక కొణిదె, మిగతా కుటుంబ సభ్యులు ఫుల్లుగా నవ్వుతున్నారు. అయితే ఈయన రాసుకొచ్చిందే ఆరోజు పెళ్లిలో అడుగాడని చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. అయితే ఈయన ఈ పోస్టులో ఏం రాసుకొచ్చారో మనం ఇప్పుడు తెలుసకుందాం.

ఎందుకు, క్యూ, యెన్, వై.. ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. ఉష్ అంటూ రాసుకొచ్చి ఏడుస్తున్న ఎమోజీలను పెట్టాడు. అలాగే నీకు పెళ్లి సంబురాలు... నాకు స్వతంత్ర పోరాటం అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే నీవు ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అలాగే దీనికి నెటిజెన్లు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ పోస్ట్ కి... వరుణ్ తేజ్ కూడా చాలా ఫన్నీ రిప్లై ఇచ్చారు. అంతేగా అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ ను చూసిన నెటిజెన్లు మరింతగా నవ్వుకుంటున్నారు. ఒక్కక్కరూ ఒక్కోలా చెప్పుకొస్తున్నారు. నేను మీ లాగా కాదు.. పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మస్త్ తెలుసంటూ ఎఫ్2లో ఆయన చెప్పిన డైలాగ్ ను రాసుకొస్తున్నారు. నేను ఉన్నాను బ్రో నీకు తోడుగా అంటూ మరికొంత అభిమానులు చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











