రానున్న రోజుల్లో మెగా అభిమానులకు పండగే.. బ్యాక్ టూ బ్యాక్ 5 సినిమాలు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా కాలం తర్వాత పెద్ద సినిమాలు చిన్న సినిమాల్లో అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నాయి ఇటీవల చిత్ర నిర్మాతల మధ్య జరిగిన చర్చల అనంతరం సినిమాల మధ్య పోటీ లేకుండా విడుదల చేసేందుకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే రానున్న రోజుల్లో మాత్రం మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి. కుదిరితే ఫిబ్రవరి నెలలోనే మెగా హీరోల సినిమాల హడావుడి కానుంది. దాదాపుగా అందరు హీరోలు కూడా ఏదో ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే 5 మెగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మెగా ట్రీట్

మెగా ట్రీట్

కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. సంక్రాంతికి రావాల్సిన సినిమాలు కూడా సమ్మర్ లోకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. కుదిరితే ఫిబ్రవరి నెల నుంచి పెద్ద సినిమాల హడావుడి మళ్లీ మొదలుకానుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మెగా అభిమానులకు వారి స్టార్ హీరోలు ఒక ప్రత్యేకమైన ట్రేడ్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఏకంగా 5 మెగా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మొదట గని..

మొదట గని..

ముందుగా పరిస్థితులు అనుకూలిస్తే మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాక్సింగ్ నేపధ్యంలో అతను చేసిన గని సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే మార్చి 4వ తేదీన విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

వర్కౌట్ అయితే..

వర్కౌట్ అయితే..

ఇక గని తరహాలోనే భీమ్లా నాయక్ సినిమా కూడా రెండు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50% ఆక్యుపెన్సీ తీసేస్తే వెంటనే విడుదల చేస్తామని కూడా నిర్మాతలు తెలియజేశారు. ప్లాన్ వర్కౌట్ అయితే సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన లేదా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు.

రామ్ చరణ్ బిగ్గెస్ట్ మూవీ

రామ్ చరణ్ బిగ్గెస్ట్ మూవీ

రామ్ చరణ్ నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కూడా మార్చిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఇరు వర్గాల అభిమానులలో కూడా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఈ సినిమాను మార్చి 25 వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Recommended Video

RRR, Bheemla Nayak Release Dates బాక్సాఫీస్ వార్ | Radhe Shyam | KGF 2 | Filmibeat Telugu
డబుల్ ట్రీట్..

డబుల్ ట్రీట్..

మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా కూడా సరికొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 29వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే వరుణ్ తేజ్ నటించిన మరొక మూవీ F 3 కూడా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి వస్తే ఆ వారం మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X