ఒకే బెడ్డుపై ముగ్గురు పెళ్లి కాని మెగా హీరోలు.. సెల్ఫీ వైరల్.. పక్కున నవ్వేసిన నిహారిక
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల హవా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు. ఇక మెగా హీరోలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేసినా కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కూడా తన కజిన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అదే ఫ్లోలో వెళుతున్న మెగా హీరోలు
మెగాస్టార్ చిరంజీవి అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రితో మెగా ఫ్యామిలీకున్న క్రేజ్ మరింత పెరిగింది. అభిమానుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆ తరువాత రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అదే ఫ్లోలో వెళుతున్నారు. ఇక ఉప్పెనతో వైష్ణవ్ ఎంట్రీ కూడా అదిరిపోయింది.

ముగ్గురు పెళ్లి కాని మెగా హీరోలు
ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లి కాని యువ హీరోలు ముగ్గురు ఉన్నారు. వాళ్లే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్. ముగ్గురు కూడా మూడు పదుల వయసు దాటి వచ్చేశారు. ఇప్పటికే సాయికి, వరుణ్ కి మ్యాచెస్ కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మెగా డాటర్ నిహారిక పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఒక్కటే కంచం ఒక్కటే మంచం
ఇక చిన్నప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ ఒక్కటే గ్యాంగ్. ఎక్కువగా ఈ ముగ్గురు ఫంక్షన్ లలో గోలగొల చేస్తుంటారు. ఇక వారికి తోడుగా నిహారిక కలిసింది అంటే రచ్చ రచ్చే.. అని చెప్పవచ్చు. ఇక చిన్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు హీరోలు ఒక్కటే కంచం ఒక్కటే మంచం అనేలా పేరిగినట్లు తెలుస్తోంది.

పక్కున నవ్వేసిన నిహారిక
సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్.. చిన్నతనం నుంచి కొన్ని ఏ మాత్రం మరలేదని అన్నాడు. వైష్ణవ్ తేజ్ గాడ నిద్రలో ఉండగా వరుణ్ తేజ్ ఒక కన్ను తెరచి సెల్ఫీకి స్టిల్ ఇచ్చాడు. ఇక వారి ఫొటోను చూసి నిహారిక ఇన్స్టాగ్రామ్ లో పక్కున నవ్వేసినట్లు కామెంట్ చేసింది. ఇక ఆ ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











