For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawankalyan : తోడబుట్టిన ఆశయం అంటూ చిరు.. ఆసక్తి రేపుతున్న బన్నీ ట్వీట్!

  |

  ఈ రోజు పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు కావడంతో ఏరోజున అభిమానులు "పవనోత్సవం" అంటూ ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసినదే. సోషల్ మీడియాలో ఆయనకు శుభాభినందనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, మెగా హీరోలు కూడా పవన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు. ఇక ఎవరెవరు ఎలా తమ పవన్ కు విషెస్ చెప్పారో పరిశీలిస్తే

  RX 100 Karthikeya కాబోయే భార్య ఎంత అందంగా ఉందొ చూశారా? హీరోయిన్స్ చాలరు!

  శుభాభినందనలు వెల్లువ

  శుభాభినందనలు వెల్లువ

  ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు, ఒకరకంగా సోషల్ మీడియాలో పవన్ పేరు నిన్నటి నుంచే ట్రెండ్ అవుతోంది. ఇక అభిమానులే కాక టాలీవుడ్‌లో కూడా ఆయనకు ఎంతో మంది సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబం నుంచి దాదాపు హీరోలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  Izabelle Leite: 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే.. హాట్ బికినీ ఫొటోస్

  తోడబుట్టిన ఆశయానికి

  అందరికీ ఆద్యుడు అయిన మెగాస్టార్ చిరంజీవి ముందుగా తన ముద్దుల తమ్ముడికి అచ్చమైన తెలుగు బాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి రాసింది నాలుగు ముక్కలే అయినా గుండెల్లో పెట్టుకునే విధంగా ఉన్నాయని సంతోష పడుతున్నారు మెగా అభిమానులు. ''చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం...కళ్యాణ్ అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.'' అని పేర్కొన్నారు.

  అల్లు అర్జున్ విషెస్

  ఇక ఆయన తరువాత అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి మెగా హీరోలు వరుసగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బన్నీ ట్వీట్ మెగా అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మరియు రాబోయే సంవత్సరం మీకు మరింత ఎక్కువ శాంతి మరియు సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటున్నానని చెబుతూ బన్నీ పవన్‌ను సంతోషంగా కౌగిలించుకున్నట్లుగా పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్నాళ్ళ నుంచి గ్యాప్ ఉందని ప్రచారం నేపధ్యంలో బన్నీ త్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

  మీకు అన్నింటిలోనూ మంచి జరగాలి

  ఇక నా గురువు, నా బలం మరియు నా పవన్ కళ్యాణ్ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిస్వార్థ ఆత్మ అయిన ఆయనకు సంతోషం, నవ్వు మరియు ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! మీకు అన్నింటిలోనూ మంచి జరగాలని కోరుకుంటున్నాను .. మోర్ లవ్ అండ్ రెస్పెక్ట్ అంటూ పేర్కొన్నారు.

  Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu

  ప్రతి విషయంలో స్టార్‌

  ఇక సినీ కథానాయకుడు, ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొనగా ప్రతి విషయంలో స్టార్‌.. బంగారం వంటి మనసున్న వ్యక్తి పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ నుంచి మరిన్ని సినిమాలు రావాలి. మా అందర్నీ ఇంకెంతగానో అలరించాలి అని కోరుకుంటున్నానని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.

  English summary
  Many film and political celebrities have taken to Twitter to wish Pawan Kalyan a happy 50th birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X