పోసానిని క్షమించొద్దు ... మెగా ప్రొడ్యూసర్ షాకింగ్ పోస్ట్..
మామూలుగా సినీ వర్గాలు నుంచి చాలా మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. అయితే వచ్చిన వారిలో అత్యధికంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ లాంటి స్థానాలు వరకు మాత్రమే కనిపిస్తారు. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పార్టీ పెట్టు సక్సెస్ రేట్ ని చూసిన వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పాలి. అలా వచ్చి పార్టీ పెట్టి సక్సెస్ కొట్టిన టాప్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరని చెప్పాలి.
ఒక్క సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు అని చెప్పాలి. సినిమాల్లో పవన్ కి వరుస విజయాలు వచ్చి తర్వాత ప్లాప్ లు వచ్చాయి. కానీ పవన్ రాజకీయ ప్రయాణం తన అన్నయ్యతో మొదలు పెట్టి భారీ పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ 2014లో పార్టీ పెట్టి అప్పుడు ప్రభుత్వం స్థాపించడంలో టీడీపీకి ఒక గేమ్ చేంజర్ లా పవన్ నిలిచాడు.

తర్వాత వారు విడిపోవడం పవన్ సొంతంగా పోటీ చేసిన క్రమంలో తాను ఎదుర్కోని ఇబ్బంది లేదు. ముఖ్యంగా పవన్ విషయంలో చాలా వరకు అంశాలు రాజకీయాలు దాటి తన పర్శనల్ లైఫ్ లోకి వెళ్లాయి. చాలా మంది సినీ ప్రముఖులే ఓ పార్టీకి మద్దతు ఇస్తూ పవన్ ని తన కుటుంబంలో ఆడపిల్లల్ని దారుణంగా దుర్భాషలాదారు. ఇవి ఎంతో హేయమైన చర్యలు అయినప్పటికీ వారు ఆపింది లేదు.
అయితే ఇపుడు పవన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరింత పవర్ఫుల్ గా మారి ఒకొక్కరి లెక్కని తెలుస్తున్నారు. పవన్ పై దారుణంగా కామెంట్స్ చేసిన వారిలో టాలీవుడ్ ప్రముఖ రచయిత అలాగే నటుడు కూడా అయినటువంటి పోసాని కృష్ణమురళి కూడా ఒకడు. ఇతను వయస్సు, మతి అన్నీ మర్చిపోయి పవన్ కుటుంబం, ఆయన ఇద్దరు కూతుళ్లు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఎంతో దారుణంగా మాట్లాడడం జరిగింది.
కానీ ఇపుడు సీన్ రివర్స్ అయ్యేసరికి నేను ఇక రాజకీయాలు వదిలేసాను, చచ్చే వరకు రాజకీయాలు చేయను, ఎవరి కోసం మాట్లాడను అంటూ కామెంట్స్ చేస్తున్నారు పోసాని. అయితే దీనిని మెగా అభిమానులు అంత తేలికగా వదిలే ప్రసక్తి లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోసాని లేటెస్ట్ కామెంట్స్ పై మెగా ప్రొడ్యూసర్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ అధినేత, మెగా అభిమాని కూడా అయినటువంటి బేబీ సినిమా నిర్మాత ఎస్ కె ఎన్ ఫైర్ అయ్యారు.
తన ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేస్తూ "సార్, ఇప్పుడు అందరికి అన్ని గుర్తొస్తాయి కానీ విరమిస్తున్నా అని నటించే ముందు కనీసం మీరు మా అభిమాన నాయకుడి గురించి ముఖ్యంగా ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్నా లేదా క్షమించండి అని అడిగి ఉంటే కనీసం ఈ మాటలు నమ్మాలనిపించేది. ఎదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు ఎన్నో సార్లు ఎంతో నీచంగా మాట్లాడారు ''.
అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు . ఛీ ఇవేం మాటలు అని చెవులు మూసుకొనేలా చేశారు, మీ ఒకళ్ళదే కాదు సార్ . అందరివీ కుటుంబాలే, ఎవరి పిల్లలు అయినా పిల్లలే. రాజకీయాల్లో విమర్శలు సహజం . కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు" అంటూ ఖరాఖండీగా ఎస్ కె ఎన్.. పోసానికి శిక్ష పడాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications










