Waltair Veerayya మెగా ఫెస్టివల్.. విజయోత్సవ వేడుక కోసం రాబోతున్న మెగా తనయుడు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో బ్లాక్ బాస్టర్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమా గా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో రవితేజ నటించిన ఒక ముఖ్యమైన పాత్ర కూడా సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది.

అంతేకాకుండా బ్యూటిఫుల్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ సినిమాలో మంచి పాత్రలో నటించే ప్రయత్నం చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ యాక్షన్ సన్నివేశాలు అలాగే దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయానికి కారణమయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ భారీ స్థాయిలోనే నిర్వహించడానికి చిత్ర యూనిట్ సభ్యులు వేదికను సిద్ధం చేసుకున్నారు. జనవరి 28న హన్మకొండలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్టు చిత్రబృందం ఇదివరకే తెలియజేసింది.

Mega power star ram charan chief guest for chiranjeevi waltair veerayya event

తాజాగా ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నట్లు ఈ రోజు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌ లో చూడాలని ఆసక్తిగా ఉన్న మెగా అభిమానులకు ఈ వార్త విపరీతమైన ఆనందాన్ని ఇచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పటికీ 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడానికి సిద్ధమయింది ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం ఇటీవల కాలంలో అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటిగా నిలిచింది ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోలశంకర్ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అలాగే వెంకయ్య కొడుకుల దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు దానయ్య నిర్మాతగా ఆ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X