ఇవే! తగ్గించుకుంటే మంచిది.. ఆ దర్శకుడికి మొహం మీదే చెప్పేసిన రామ్ చరణ్
సినిమా సినిమాకు హీరోల ఆలోచనల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ హంగులతో హడావుడి చేసిన వారు కూడా ఇప్పుడు వీలైనంత కొత్తగా ట్రై చేసేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా పాన్ ఇండియా కథలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇక ఎంత సక్సెస్ ఫుల్ దర్శకుడు వచ్చినా కూడా కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఇటీవల ఒక బాక్సాఫీస్ దర్శకుడు చెప్పిన కథకు రామ్ చరణ్ డైరెక్ట్ గా కుదరదని చెప్పేశాడట.

గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి
ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళితో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో అంచనాలు భారీగానే క్రియేట్ అయ్యాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కు కూడా ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. నేషనల్ వైడ్ గా మార్కెట్ పెంచుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి ఉండదు.

వీలైనంత వరకు పాన్ ఇండియా సినిమాలే..
బాహుబలి లాంటి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRRపై నేషనల్ మీడియా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక ఇందులో నటిస్తున్న హీరోల భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక అంచనాల డోస్ పెరిగింది కాబట్టి చరణ్ కూడా కథల ఎంపిక విషయంలో అదే లెవెల్లో ఆలోచిస్తున్నాడు. వీలైనంత వరకు పాన్ ఇండియా కాన్సెప్ట్ లోనే హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

చరణ్ కి ఎందుకో నచ్చలేదట..
ఇక గత కొంతకాలంగా రామ్ చరణ్ తో సినిమా చేయాలని యూవీ క్రియేషన్స్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఛలో, భీష్మా వంటి హిట్స్ అందుకున్న వెంకీ కుడుములకు అడ్వాన్స్ ఇచ్చి మెగాపవర్ స్టార్ కోసం కథను రెడీ చేయమని కూడా అన్నారు. గత రెండు నెలల క్రితమే ఒక లైన్ చెప్పిన వెంకీ రామ్ చరణ్ ని బాగానే మెప్పించడట. కానీ ఇటీవల మరోసారి చర్చల్లో పాల్గొని ఫుల్ కథ చెప్పగా చరణ్ కి ఎందుకో నచ్చలేదట.
Recommended Video

మరో ఛాన్స్ ఇచ్చిన చరణ్
RRR తరువాత క్రేజ్ కి తగ్గట్టుగా కథ ఉంటే బావుంటుందని వివరణ ఇచ్చిన రామ్ చరణ్ టాలీవుడ్ ఓల్డ్ స్టైల్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని వీలైనంత వరకు తగ్గిస్తే మంచిదని ఆన్సర్ ఇచ్చాడట. ఇక యూవీ క్రియేషన్స్ చరణ్ కి సన్నిహితులే కావడంతో మరొక ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వెంకీ ఇప్పుడు మరో కథపై కూర్చున్నట్లు సమాచారం. అలాగే మరోవైపు చరణ్ డేట్స్ కోసం మరికొందరు సీనియర్ దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











