కమిటీ కుర్రోళ్ళకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్.. నిహారికపై ప్రేమను చూపిస్తూ అలా!

గతంలో కంటే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్టు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. అందులో పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే స్టోరీలతో వచ్చే చిత్రాలకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. అలాంటి వాటిలో కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆ సినిమాల్లో మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' (Committee Kurrollu) సినిమా ఒకటి. ఎమోషనల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే...

పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు నటించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మించడంతో దీనిపై అందరి దృష్టి పడింది. అందుకు అనుగుణంగానే ఇది విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ చిత్రం మంచి బిజినెస్‌తో ఆగస్టు 9వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Mega Power Star Ram Charan Review on Committee Kurrollu Movie

ఫన్ అండ్ ఎమోషన్స్‌తో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన కూడా లభిస్తోంది. దీంతో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకుని.. ఈ సినిమా లాభాల బాటలో పయణిస్తోంది.

1990 నాటి పరిస్థితులను గుర్తు చేసే కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీకి అన్ని వర్గాల సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. అలాగే కొందరు సినిమా వాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ మూవీపై ట్వీట్ చేశాడు.

రామ్ చరణ్ తాజాగా ''కమిటీ కుర్రోళ్లు' సినిమా ఘనవిజయం సాధించినందుకు అభినందనలు నిహారిక తల్లి. మీ చిత్ర యూనిట్‌తో పాటు మీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. నమ్మశక్యంకాని కృషి చేసిన నటీనటులు, సిబ్బందికి అభినందనలు. ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక అభినందనలు. మీరు అన్నింటికీ అర్హులు' అని చెప్పాడు.

ఇదిలా ఉండగా.. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందింది. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X