క్లోజ్ ఫ్రెండ్ మూవీపై రామ్ చరణ్ రివ్యూ.. థ్యాంక్యూ డియర్ అంటూ!
అసలు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే ఎంట్రీ ఇచ్చినా.. తనదైన విలక్షణ నటనతో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. ఆరంభం నుంచీ విభిన్నమైన సినిమాలతో సత్తా చాటుతోన్న ఈ కుర్రాడు.. హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో తాజాగా 'మనమే' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా రామ్ చరణ్ రివ్యూ ఇచ్చాడు. ఆ వివరాలను మీరే చూడండి!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమానే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మోస్తరు భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా డల్‌గానే వసూళ్లు సాధిస్తోంది.

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మనమే' మూవీకి ఓ వర్గం సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. అలాగే కొందరు సినిమా వాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సైతం 'మనమే' మూవీపై తన రివ్యూను చెప్పాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా 'మనమే' సినిమాను వీక్షించాడు. ఈ విషయాన్ని తన X (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించాడు. ఈ మేరకు ఓ పోస్టు చేస్తూ అందులో 'మనమే సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేశాను. శర్వానంద్ పెర్ఫార్మెన్స్ ఔట్ స్టాండింగ్‌గా ఉంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పని చేసిన టెక్నీషియన్లు అందరికీ కంగ్రాట్స్' అంటూ చెప్పుకొచ్చాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 'మనమే' సినిమాను చూడడంతో పాటు మెచ్చుకుంటూ చేసిన ట్వీట్‌కు హీరో శర్వానంద్ కూడా ఫిదా అయిపోయాడు. అందుకే అతడి ట్వీట్‌కు 'థ్యాంక్యూ డియరెస్ట్ రామ్ చరణ్' అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్‌తో 'మనమే' సినిమా ప్రదర్శన మరింత కొనసాగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబోలో రూపొందిన 'మనమే' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











