వరుణ్ తేజ్ కోసం విలన్ పాత్ర.. అంగీకరిస్తాడా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ వంటి సూపర్ హిట్స్ తో క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో అంతరిక్షం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ కోసం ఓ క్రేజీ పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వరుణ్ ఆ పాత్రలో నటించడం అంటే సాహసం చేసినట్లే.
ఎందుకంటే అది నెగిటివ్ షేడ్స్ అనే పాత్ర. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన జిగర్తాండ చిత్రంలో బాబీ సింహ విలన్ పాత్రలో నటించారు. ఆ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాబీ సింహకు ప్రశంసలు దక్కాయి. హీరోగా నటించిన సిద్ధార్థ్ కంటే బాబీ సింహ పాత్రే ఎక్కువ హైలైట్ అయింది.

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రలో వరుణ్ అయితే బావుంటుందని భావిస్తున్నారు. కానీ హీరోగా దూసుకుపోతున్న వరుణ్ ఈ పాత్రకు అంగీకరిస్తాడా అనేదే పెద్ద ప్రశ్న.


Click it and Unblock the Notifications











