Varun Tej Lavanya Wedding: ఆ ముహూర్తానికే లావణ్య, వరుణ్ పెళ్లి.. ఎందుకంత స్పెషల్?

మెగా ఇంట్లో పెళ్లి భాజాలకు వేళా అయింది. నాగబాబు, పద్మజ కొణిదెల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్, కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి... మరొకొద్ది గంటల్లో ఏడు అడుగులు వేయబోతున్నారు. నవంబర్ 1న వీరు ఇరు కుటుంబాల సాక్షిగా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అయితే వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. దానికి ఓ స్పెషల్ ఉందని తెలుస్తోంది. ఆ ముహూర్తానికి ఎందుకు చేసుకోబోతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెగా ఫ్యామిలీలో పూర్తి పెళ్లి సందడి షురూ అయిపోయింది. వరుణ్ - లావణ్య పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు.. వీరి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇక వీరి నవంబరు 1న ఇటలీలో పెళ్లి వేడుక జరగనుంది. ఇక వీరి పెళ్లికి ఇటు మెగా ఫ్యామిలీ అటు అల్లు ఫ్యామిలీ.. మరోవైపు లావణ్య ఫ్యామిలీ హాజరు కానుంది.

Mega Prince Varun Tej Lavanya Tripathi Destination Wedding Time And Full Details Here

లావణ్, వరుణ్.. ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. నిన్న రాత్రి ఏర్పాటు చేసిన కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి హల్దీ వేడుక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈరోజు 5:30 గంటల నుంచి మెహందీ నిర్వహించనున్నారు. ఇక ఈ పార్టీల్లో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లికి సందడి చేయనున్నారు.

ఇక వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. రేపు నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2:48కి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ముహూర్తాన వరుణ్.. లావణ్య మెడలో తాళి కట్టనున్నారు. ఇక ఈ సమయం నుంచే వారు భార్య భర్తలు అవుతారు. అదేరోజు సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం, స్నేహితులు సహా దాదాపు 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.

Mega Prince Varun Tej Lavanya Tripathi Destination Wedding Time And Full Details Here

ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు నితిన్ కూడా ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. పెళ్లి బస్ ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నితిన్. మొత్తానికి వరుణ్ తేజ్ పెళ్లిలో అందరూ సందడి చేయనున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కూడా సతీ సమేతంగా వెళ్లారు. మరో విషయం ఏంటంటే.. వీరి పెళ్లికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రావాల్సి ఉందట. ఆమెకు వరుణ్ ప్రత్యేక ఆహ్వానం పంపారని తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లికి రాలేను అని సున్నితంగా తిరస్కరించందని తెలుస్తోంది.

ఇక వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ముహూర్తం నెట్టింట వైరల్ గా మారింది. ప్రత్యేకంగా ఆ ముహూర్తమే ఎందుకంటే.. వారి జీవితం బాగుండాలని పురోహితులు నిశ్చయించారని తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి అనంతరం... నవంబరు 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X