Varun Tej-Lavanya: ఎట్టకేలకు వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. శుభలేఖ ఎలా ఉందో చూశారా?
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి తేదీ ఫిక్స్ అయిపోయింది. అదిగో పెళ్లి.. ఇదిగో పెళ్లి అంటూ గత కొంత కాలంగా వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇప్పటికే ఇటలీకి వెళ్లిపోయిన మెగా ఫ్యామిలీ... వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వివరాలు బయటకు వచ్చేశాయి. అసలు వారి పెళ్లి తేదీ ఎప్పుడు.. ఎక్కడ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలు అయింది. ఇప్పటికే వెంకటేష్ రెండో కూతురు హియవాహిని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలు.. వెంకీ మామ కూతురి పెళ్లికి హాజరు అయ్యారు. ఇక ఘనంగా ఆ వేడుకలు జరిగాయి. మరోవైపు కీరవాణి కొడుక్కు.. మురళి మోహన్ మనవరాలికి పెళ్లి అంటూ ప్రచారం సాగుతోంది. వీరి పెళ్లి కూడా త్వరలోనే జరగనుందట.

ఇక ఎప్పటి నుంచో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వార్తలు వస్తునే ఉన్నాయి. ఇక వీరి పెళ్లి తేదీ ఎట్టకేలకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా సాగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇంటలీ బయలుదేరారు. రామ్ చరణ్ ఫ్యామలీ, నాగ బాబు ఫ్యామిలీ అటు చిరంజీవి, అల్లు అర్జున్ ఫ్యామిలీలు కూడా ఇటలీకి బయలుదేరారట.
ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ పెళ్లి శుభ లేఖలో వరుణ్ తేజ్.. నాయనమ్మ, తాతయ్యల పేర్లతో పాటు పెదనాన్న, బాబాయిలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ పేర్లు ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీలోని అందరి పేర్లను ముద్రించారు. ప్రస్తుతం ఈ శుభలేఖ నెట్టింట అయితే వైరల్ గా మారింది.

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగనుంది. అక్టోబర్ 30వ తేదీ నుంచే వీరి పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీ నగరంలో... వరణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఇక అక్కడే వారు పెళ్లి తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని టాలీవుడ్ వర్గాల ఇన్ సైడ్ టాక్.
ఇక ఇటలీలో జరగబోయే పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం అక్టోబర్ 27న బయలుదేరనున్నారని తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. మరి వీరి పెళ్లికి పవన్ కల్యాణ్ వెళ్తాడా లేదా అనేది సందేహంగా మారింది. దానికి కారణం... ప్రస్తుతం పవన్ కల్యాణఅ ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. చూడాలి మరి వెళ్తాడో లేదో.


Click it and Unblock the Notifications











