డైరెక్టర్‌తో నాకు సమస్యలు.. అల్లు అర్జున్ మూవీ డిజాస్టర్ ముందే డిసైడ్ అయ్యా: అల్లు అరవింద్

అల్లు అరవింద్ .. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. టాలీవుడ్‌ను శాసిస్తోన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దశాబ్ధాల అనుభవం ఉన్న అల్లు అరవింద్ జడ్జ్‌మెంట్ కొన్నిసార్లు మినహా ఎప్పుడూ తప్పలేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి.

అల్లు రామలింగయ్య తన చివరి శ్వాస వరకు నటుడిగానే కొనసాగారు. అలాంటి వ్యక్తికి కుమారుడిగా నట వారసత్వాన్ని తీసుకోకుండా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అల్లు అరవింద్ . పక్కా ప్లానింగ్‌తో, బడ్జెట్‌తో సినిమాలు తీస్తూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. పరిశ్రమలో నిర్మాతకు విలువ తగ్గుతున్న రోజుల్లో ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఎలా శాసించగలడో నిరూపించిన వారిలో అరవింద్ ఒకరు.

Mega Producer Allu Aravind made sensational comments on Ala Vaikunthapurramuloo hindi Remake Shehzada

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అల్లు అరవింద్‌ ఉద్యోగం చేయనని వ్యాపారం చేస్తానని చెప్పి దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన బంట్రోతు భార్య చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను స్ధాపించి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తన బావమరిది చిరంజీవితో ఎక్కువగా సినిమాలు తీసిన అల్లు అరవింద్ .. మెగా - అల్లు ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా నిలిచారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరి ఎదుగుదల వెనుక కీలకపాత్ర పోషించి మెగా ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 60కి పైగా సినిమాలు నిర్మించారు.

సినిమాలతో పాటు పలు ఇతర రంగాలలోనూ అల్లు అరవింద్ పెట్టుబడులు పెట్టి అక్కడా హిట్ కొట్టారు. భవిష్యత్తులో ఓటీటీ రంగం సక్సెస్ అవుతుందని ముందుగానే ఊహించి ఆహా పేరుతో ఓటీటీని తీసుకొచ్చి తెలుగు వారు తలచుకుంటే ఎక్కడైనా సత్తా చాటగలరని నిరూపించారు. ఇక అల్లు అర్జున్ జడ్జిమెంట్‌ని ఇండస్ట్రీలో అంతా ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఏ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుంది? అసలు బిజినెస్ జరుగుతుందా? లేదా? అన్నది లెక్కలతో సహా ముందే చెప్పగలరు అల్లు అరవింద్.

Mega Producer Allu Aravind made sensational comments on Ala Vaikunthapurramuloo hindi Remake Shehzada

ఓ సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అక్షరాల నిజమై ఇండస్ట్రీనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ హీరోగా హిందీలో షెహజాదా పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి రోజు కేవలం రూ.7 కోట్ల ఓపెనింగ్స్‌తో డల్‌గా థియేట్రికల్ రన్ ఆరంభించిన షెహజాదా లాంగ్ రన్‌లో భారీ నష్టాలను మిగిల్చింది.

ఈ సినిమా ఫెయిల్ అవుతుందని ఖచ్చితంగా అంచనా వేశారు అల్లు అరవింద్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షెహజాదా గురించి ఆసక్తికర వివరాలు పంచుకున్నారు. టీ సిరీస్, హారిక హాసినీ క్రియేషన్స్‌తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. అల వైకుంఠపురంలో చిత్రానికి పాటలు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయని.. హిందీకి వచ్చేసరికి ఆ లోటు కనిపించిందని అరవింద్ అన్నారు. ఈ సినిమా ఆడదని అప్పుడే అర్ధమైందని, అలాగే డైరెక్టర్ విజన్‌కి, నా విజన్‌కి సెట్ కాకపోవడంతో నిర్మాతగా తప్పుకున్నట్లు ఆయన అసలు విషయం బయటపెట్టారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు చిత్ర సీమలో చర్చనీయాంశమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X