నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టంలేదు .. 30 ఏళ్ల నిజాలు బట్టబయలు..!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతోన్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ' సీజన్ 4 దుమ్మురేపుతోంది. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా రాగా.. తర్వాత లక్కీ భాస్కర్ టీమ్, సూర్య వచ్చారు. ఈ వారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు, తల్లి నిర్మలతో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు అల్లు అర్జున్. ఈ వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి చిరు తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు సినీరంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కుమారుడు, దివంగత అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో స్టైలీష్ స్టార్‌గా యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు.

నటన, డైలాగ్స్, ఫైట్స్‌తో పాటు ఈ జనరేషన్ తెలుగు హీరోల్లో డ్యాన్స్‌కు ఐకాన్‌గా మారారు. ఎలాంటి రిస్కీ స్టెప్స్ అయినా సరే అలవోకగా చేస్తూ మావయ్య చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టారు. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి విలక్షణ చిత్రాలలోనూ నటించి నటుడిగా మరో మెట్టుపైకెక్కారు బన్నీ. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ కెరీర్‌ను పుష్ప మలుపు తిప్పింది.
గంధపు చెక్కల స్మగ్లర్‌గా , డీ గ్లామర్ రోల్‌లో అల్లు అర్జున్ నటన హైలైట్‌గా నిలిచింది. డ్యాన్స్, ఫైట్స్, మేనరిజంతో బన్నీ దేశాన్ని ఊపేశారు. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై.. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డుల్లోకెక్కారు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది.
ఇక బాలయ్య షోకి వచ్చిన అల్లు అరవింద్ సతీమణి నిర్మలను ముగ్గురు అబ్బాయిల్లో ఎవరంటే ఇష్టమని అడుగుతారు. ఈ క్వశ్చన్ తనను చాలా మంది అడిగారని.. అయితే శిరీష్ ఆవిడకు ఫేవరేట్ అని, కానీ ఆమె ఒప్పుకోదని నా ఫీలింగ్ అంటాడు అల్లు అర్జున్. నేను లాస్ట్ 30 ఏళ్లుగా ఈ విషయాన్ని అడుగుతూనే ఉన్నానని అంటాడు. నాకు ఇష్టమైన వాళ్లు ఎవరో చెప్పాలి కానీ, ఒప్పుకోవడం ఏంటని ఆమె ఆన్సర్ ఇస్తుంది. శిరీష్ అంటేనే ఎక్కువ ఇష్టమని బాలయ్య కూడా అనడంతో .. నిజమే తనంటేనే ఎక్కువ ఇష్టమని , అబద్ధం 30 ఏళ్లు ఆడలేం కదా అని నిర్మల ఆన్సర్ ఇస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











