పవన్ కల్యాణ్ హీరోయిన్‌తో పులిహోర.. ట్రోల్స్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సీరియస్

తెలుగు సినిమా దగ్గర పరిచయం అయ్యిన కొన్ని సినిమాలతోనే మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో తన గ్లామర్ షోతో కుర్రకారు మతి పోగొట్టిన యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒకామె అని చెప్పాలి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు సినిమాలో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిన నిధి అక్కడ నుంచి మరింత బిజీగా మారిపోయింది.

కాగా ఇక్కడ నుంచి పాన్ ఇండియా ఆఫర్స్ ని ఈమె అందుకోగా ఇప్పుడు తెలుగులో పలు భారీ సినిమాలు అది కూడా బిగ్ స్టార్స్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. కాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ తో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ నిధి తెలుగు సినిమాలో ఫుల్ బిజీగా ఉంది.

mega producer flirts with pawan kalyan heroine nidhhi agerwal in social media

అయితే పవన్ తో చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు" సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం దీనితో పాటుగా ప్రభాస్ తో "ది రాజా సాబ్" సినిమాల్లో ఈమె ఫుల్ బిజీగా ఉంది. కాగా ఇప్పుడు రెండు సినిమాలు కూడా ఏకకాలంలో వర్క్ చేస్తూ ఒక సినిమా నుంచి మరో సినిమాకి షిఫ్ట్ కొడుతోంది. దీనితో ఈమె డెడికేషన్ చూసి మెగా యంగ్ అండ్ మాస్ ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ అమితంగా ఇంప్రెస్ అయ్యిపోయాడు.

కాగా నిధి అగర్వాల్ పెట్టిన ఓ పోస్ట్ కి తాను ఇచ్చిన రిప్లై దానికి నిధి ఇచ్చిన రిప్లైలు వైరల్ గా మారాయి. కాగా నిధి నిన్న ఒక గోల్డెన్ కలర్ చీర కట్టులో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసుకుంది. మరి దీనికి ఎస్ కె ఎన్ రిప్లై ఇస్తూ పని విషయానికి వస్తే నువ్వు నిజంగానే బంగారం. నీ పాత్రల విషయంలో ఎప్పుడు ఓపికగా ఫ్యాషనేట్ గా వర్క్ చేస్తావు ఈ 2025 హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలతో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని రిప్లై ఇచ్చాడు.

mega producer flirts with pawan kalyan heroine nidhhi agerwal in social media

దీనితో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పులిహోర కలుపుతున్నావ్ అన్నా అంటూ పలు కామెంట్స్ దీనికి రాగా వీటిపై ఎస్ కె ఎన్ ఫైర్ అయ్యాడు. పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరకి పని కోసం వచ్చిన హీరోయిన్స్ ని గౌరవించాలి అంటూ సీరియస్ అయ్యాడు.

కాగా ఆ బంగారం స్టేట్మెంట్ కి నిధి అగర్వాల్ కూడా రిప్లై ఇచ్చింది. "మీ మాటలు నాకు ఎంతగానో మెప్పించాయి, ఏదో చిన్న స్థాయి నుంచి ఇప్పుడు నిర్మాతగా మీరు మారారు అందుకు హ్యాట్సాఫ్, ది రాజా సాబ్ చేసే మ్యాజిక్ ప్రేక్షకులు చూసేందుకు నేను వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా నిధి తెలిపింది. దీనితో ఈ ఇద్దరి కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: nidhhi agerwal pawan kalyan skn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X