మెగా 'వారసుడు' వివాదం.. చిరు మాటల విషయంలో ప్రముఖ నిర్మాత ఫైర్

ఇప్పుడు తెలుగు సినిమాకి సంబంధించి మెగా కుటుంబం అలాగే మెగా హీరోల విషయంలో ప్రతి చిన్న అంశం కూడా పెద్ద విషయంలో మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ కావడం దాని వెనుక ఉన్న కారణం మెగా హీరోల విషయంలో నీ రేంజ్ లో నెగిటివ్ ఉందో చూపించింది.

సినిమా తర్వాత రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు ఏకంగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ మీడియా సైతం కవర్ చేసి రేంజ్ లో మారిపోయింది. కాగా మెగాస్టార్ చిరంజీవి తనకి తన కొడుకు రాంచరణ్ నుంచి ఒక వారసుడు కావాలని కోరుకుంటున్నట్టుగా చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి.

Mega producer skn makes sensational comments on chiru controversial statement

అయితే తన వారసత్వాన్ని ప్రస్తుతం రామ్ చరణ్ ముందుకు తీసుకెళుతుంటే తన తర్వాత పుట్టబోయే మగ బిడ్డ తమ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చిరంజీవి భావిస్తున్నట్టుగా తెలిపారు. అయితే చిరంజీవిలా అంటే భారీ స్థాయిలో ఉన్న బిగ్ స్టార్ ఈ తరహా కామెంట్ చేయడం పెద్ద విషయంగా మారిపోయింది.

ప్రతి ఇంటికి ఆడబిడ్డ ఉన్నట్టుగా కొణిదల కుటుంబంలో కూడా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, రామ్ చరణ్ మొదటి సంతానం కూడా క్లీన్ కారా జన్మించింది. చిరంజీవి ఒక మగ బిడ్డని కోరుకోవడం దీన్ని రామ్ చరణ్ విషయంలో చెప్పడంతో ఇతర హీరోల అభిమానులు అందరూ రాజకీయ నాయకులు నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు.

అయితే ఈ అన్ని నెగటివ్ కామెంట్స్ పై మెగా ప్రొడ్యూసర్ బేబి నిర్మాత ఎస్ కే ఎన్ విరుచుకుపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం కోసం మాట్లాడుతూ "పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది. నిండైన ఫ్యామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు. తనపై అవాకులు చెవాకులు పేలుతున్న వారిపై మాత్రం ఓ రేంజ్ లో ఇచ్చి పడేసారు.

కాగా ఇంకోపక్క మెగా అభిమానులు కూడా ఈ కామెంట్స్ విషయంలో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. చిరంజీవి ఏదో అసలు ఆడపిల్ల వద్దు మగ పిల్లాడే కావాలి అన్నట్టు వాంటెడ్ నెగిటివ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఇపుడు యువ దర్శకుడు వశిష్ఠతో భారీ సినిమా విశ్వంభర చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ సినిమా తర్వాత మరో ఇద్దరు యువ దర్శకులు శ్రీకాంత్ ఓదెలతో క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ అలాగే దర్శకుడు అనీల్ రావిపూడితో దానికి పూర్తి భిన్నమైన క్రేజీ కామెడి ఎంటర్టైనర్ ని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే వీటిలో చిరు, అనీల్ సినిమా అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: chiranjeevi ram charan klin kara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X