Allu Arjun : అల్లు అర్జున్‌కు మెగా సపోర్ట్ .. రంగంలోకి చిరంజీవి

పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయనను అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ ఎలాంటి స్టెప్ తీసుకుంటోందనని ఉత్కంఠ నెలకొంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీది చెరగని ముద్ర. ఇక తొలి నుంచి మెగా హీరోలది , కుటుంబానికి ఒకే మాట. కుటుంబంలో కానీ, సినిమా విషయాలలో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చి నిలిచేది . ఎవరికి కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలిచేవారు. అయితే ఈ కుటుంబంలో పరిణామాలు గతంలో మాదిరిగా లేవని.. ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహారం అనేక అనుమానాలు తెచ్చిపెడుతోంది. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని , తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంటోందని పుకార్లు వైరల్ అవుతున్నాయి.

mega star Chiranjeevi and his wife Surekha reached allu arjun s residence

చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్‌తో పాటు నిన్న మొన్నటి నంద్యాలలో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం వరకు బన్నీ వైఖరి మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తుంటాయి. తొలుత చూసీ చూడనట్లుగా వదిలేసినప్పటికీ.. ఏపీ ఎన్నికల తర్వాత మెగా పెద్దలు అల్లు అర్జున్ తీరుపై సీరియస్ అయినట్లుగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్‌పై నాగబాబు ట్వీట్, బన్నీ దంపతులను సాయిథరమ్ తేజ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం .. ఈ పరిణామాలు దుమారం రేపాయి.

అల్లు అర్జున్ కూడా కొన్ని సందర్భాలలో మెగా ఫ్యామిలీపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అలాగే ఫ్యాన్స్‌ని చూసి తాను హీరో అయ్యానని.. తన వెనుక అల్లు ఆర్మీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో పుష్ప చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. అయితే చిరుని కలిసిన బృందంలో హీరో అల్లు అర్జున్ లేకపోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

కానీ ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబానికి పెద్ద కష్టం కలిగింది. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనను రిమాండ్‌కు తరలిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మేనల్లుడి అరెస్ట్ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వంభర షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకుని భార్యతో కలిసి హుటాహుటిన అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. అటు మెగా బ్రదర్ నాగబాబు కూడా అరవింద్ నివాసానికి బయల్దేరారు. ఈ పరిణామాలతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun hyderabad police
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X